Puneeth Rajkumar: మరణించీ చిరంజీవి ఈ హీరో.. నీవు లేవు నీ జ్ఞాపకాలు పదిలం అంటోన్న స్టూడెంట్స్.. శాటిలైట్ కు పునీత్ పేరు
తాజాగా మరో అరుదైన గౌరవం కూడా పునీత్ రాజ్‌కుమార్‌కు దక్కింది. భారతదేశ చరిత్రలో తొలిసారిగా కర్ణాటక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రూపొందించిన కేజీఎస్-౩ శాటిలైట్‌కు ‘శాటిలైట్ పునీత్’ అని పేరు పెట్టారు.

Puneeth Rajkumar Satellite
మనిషి చనిపోయాక కూడా జీవించి ఉండాలి, అదే నిజమైన జీవితం అంటారు. మనషి బ్రతికి ఉండగా చేసిన మంచి పనులు అతన్ని మరణించాక కూడా జీవించేలా చేస్తాయి. అలా ఎన్నో మంచి పనులు చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్. ప్రాంతాలకతీతంగా ప్రజల మన్నననలు పొందారు పునీత్. అందుకే ఆయనను ఇటీవల కర్నాటక ప్రభుత్వం కర్నాటక రత్న అవార్డుతో సత్కరించింది. అయితే తాజాగా మరో అరుదైన గౌరవం కూడా పునీత్ రాజ్‌కుమార్‌కు దక్కింది. భారతదేశ చరిత్రలో తొలిసారిగా కర్ణాటక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రూపొందించిన కేజీఎస్-౩ శాటిలైట్‌కు ‘శాటిలైట్ పునీత్’ అని పేరు పెట్టారు.
KGS3Sat పేరుతో, కర్ణాటక ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల శాటిలైట్ ప్రాజెక్ట్‌కు మరణానంతరం పునీత్ ను గౌరవించడం కోసం పేరు మార్చబడింది. రూ 1.90 కోట్ల వ్యయంతో విద్యార్థులు దీనిని అభివృద్ధి చేస్తున్నారు. ఈ శాటిలైట్ పూర్తయిన తర్వాత శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించబడుతుంది.
ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు రూపొందించిన 75 ఉపగ్రహాలను నింగిలోకి పంపాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా కర్ణాటక విద్యార్థులు రూపొందించిన ఈ శాటిలైట్‌ను ఈ నెలాఖరులో తిరుపతి జిల్లాలోని సతీశ్ దావన్ స్పేస్ సెంటర్ నుంచి కక్ష్యలోకి పీఎస్‌ఎల్‌వీ-సి54 వాహకనౌక ద్వారా పంపనున్నారు. ఈ మేరకు సన్నాహాలు చురుగ్గా జరుగుతున్నాయి.
“ఈ ఉపగ్రహ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వచ్చింది” అని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్ సీఎన్ అశ్వత్ నారాయణ్ తెలిపారు. “పాఠశాల, కళాశాల విద్యార్థులు అనేక రాష్ట్ర , జోనల్ స్థాయి పోటీలలో పాల్గొన్నారు. అయితే ఎంపిక చేయబడిన 1,000 మంది విద్యార్థులు మాత్రమే ఈ శాటిలైట్ బిల్డింగ్ మిషన్‌లో భాగం కావడానికి షార్ట్‌లిస్ట్ చేయబడ్డారని పేర్కొన్నారు.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..