Sun Transit 2023: ఈ రాశివారు విదేశాలకు వెళ్లే చాన్స్.. మిధునంలో సూర్య సంచారం ఏయే రాశులకు లాభాలను తెస్తుందంటే..? – Telugu News | Sun Transit 2023: as Sun transits to Gemini on June 15, These Zodiac Signs will get immense money and prosperity
Sun Transit 2023: జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్య భగవానుడిని గ్రహాల రాజుగా పేర్కొంటారు. ఇక సూర్యుని స్థితిగతులు రాశిచక్రంలోని పన్నెండు రాశులపై కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ క్రమంలోనే సూర్యుడు జూన్ 15న సాయంత్రం 6.07 గంటలకు మిధున రాశిలోకి
Sun Transit 2023: జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్య భగవానుడిని గ్రహాల రాజుగా పేర్కొంటారు. ఇక సూర్యుని స్థితిగతులు రాశిచక్రంలోని పన్నెండు రాశులపై కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ క్రమంలోనే సూర్యుడు జూన్ 15న సాయంత్రం 6.07 గంటలకు మిధున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇక ఇలా మిధునంలోకి సూర్యుని ప్రవేశం కొన్ని రాశులపై విష ప్రభావాలను, మరి కొన్ని రాశులపై సానుకూల ప్రభావాలను చూపిస్తుంది. అయితే ఏయే రాశులకు సుర్యుడి మిధున ప్రవేశం అనుకూలంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం..
మిధున రాశి: జ్యోతిష్య శాస్త్రం మిధున రాశిలో సూర్య సంచారం ఈ రాశివారికే అధిక ఆర్థిక లాభాలను తెస్తుంది. ఇంకా ఈ సమయంలో మిధున రాశివారు ఎంతో ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో బంధాలు బలపడతాయి. ఆరోగ్య సమస్యల నుంచి కూడా పూర్తి ఉపశమనం పొందుతారు.
కర్కాటక రాశి: మిథున రాశిలో సూర్య గ్రహ సంచారం కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఎలా అంటే ఈ సమయంలో మీకు సమాజంలో గౌరవం, ఆయురారోగ్యాలు కలుగుతాయి. ప్రేమ వ్యవహారాలలో వైఫల్యం ఉండవచ్చు కానీ సమస్యల నుంచి పుంజుకుంటారు.
కన్యా రాశి: మిధునంలో సూర్య గ్రహ ప్రవేశం కన్యా రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది.ఈ సమయంలో మిధున వాశివారు విదేశాలకు వెళ్లే అవకాశం, సీనియర్ అధికారులతో సమన్వయం, వ్యాపారంలో మంచి లాభాలు కలుగుతాయి.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..