Suma Kanakala,Anchor Suma: నేను నిద్రపోనూ.. ఎవర్నీ నిద్రపోనివ్వను.. యాంకర్ సుమలో మరో కోణం – anchor suma kanakala other side funny video goes viral
ఇక యాంకర్ సుమ మైక్ పట్టుకుందంటే.. పంచ్‌ల ప్రవాహమే. తన సమయస్పూర్తితో నాన్ స్టాప్‌గా వినోదాన్ని పండిస్తూనే ఉంటుంది. కేవలం ఆడియో ఈవెంట్లలోనే కాదు.. టీవీ షోలు, షూటింగ్ లొకేషన్స్‌లో కూడా సుమ ఉందంటే హంగామా మామూలుగా ఉండదు. సెట్స్‌లో ఆమె చేసే అల్లరికి సంబంధించి ఇప్పటికే చాలా వీడియోలు వదిలింది యాంకర్ సుమ.
అవన్నీ ఒక ఎత్తైతే ఆమె పోస్ట్ చేసిన తాజా వీడియో మరో ఎత్తు. అయ్యో పాపం అనేట్టుగా ఉన్న ఈ వీడియో చూస్తే నవ్వుకునే వాళ్లకి నవ్వు.. తిట్టుకునే వాళ్లకి తిట్లు అనేట్టుగా ఉంటుంది. అందుకే కామెంట్స్ ఆఫ్ చేసి మరీ ఈ వీడియో పోస్ట్ చేసింది యాంకర్ సుమ.
షూటింగ్ లొకేషన్‌లో ఒక వ్యక్తి.. అలసిపోయి కుర్చీలోనే నిద్రపోతున్నాడు. అది చూసిన సుమ.. మెల్లగా అతని పక్కకి వచ్చి.. ‘హ్యాపీ బర్త్ డే’.. అంటూ పెద్దగా అరిచింది. సుమ అరుపుకి ఉలిక్కిపడి లేచాడు అతను. సుమ మాత్రం ఏమీ తెలియనట్టుగా అక్కడ నుంచి నవ్వుకుంటూ వెళ్లిపోయింది. చుట్టూ ఉన్న వాళ్లు ఆ వ్యక్తిని చూసి హేళనగా నవ్వారు. సుమ సరదా కోసం చేసినా అతను ఉలిక్కిపడిన విధానం చూస్తే శాడిజంలాగే ఉంది. అతన్ని చూస్తే అయ్యో పాపం అనకమానరు. ఈమెకి ఇదేం శాడిజం అని కామెంట్స్ చేస్తారనుకుందో ఏమో కానీ.. కామెంట్స్ బాక్స్ ఆపేసి మరీ ఈ వీడియోను పోస్ట్ చేసింది యాంకర్ సుమ.