News

sujana chowdary, జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పగబట్టినట్లు ఇలా చేయడం దారుణం.. బీజేపీ నేత సుజనా చౌదరి – bjp leader sujana chowdary serious om cm ys jagan mohan reddy


వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అమరావతి రైతుల విషయంలో పగపట్టినట్టు పని చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చర్యలు వినాశనానికి దారి తీసేలా ఉన్నాయని ఆరోపించారు. ఆర్‌- 5 జోన్ పేరుతో పేద ప్రజలకు సెంటు భూమి ఇస్తామనే కార్యక్రమం చేపట్టారని పేర్కొన్నారు. అయినా, పేద ప్రజలకు అమరావతిలో భూములు ఇస్తే ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. వాళ్లు అక్కడకు వెళ్లి ఏం చేసుకోగలరని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

అధికార వికేంద్రీకరణ జగన్ ప్రభుత్వం ఎక్కడి వారికి అక్కడే భూమలు ఎందుకు ఇవ్వడం లేదని సుజనా చౌదరి సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పేద ప్రజలందరికీ అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇవ్వగలరా.. ఇది సాధ్యమా అని సుజనా చౌదరి నిలదీశారు. ల్యాండ్‌ డెవలప్‌మెంట్ కోసం భూమి ఇస్తే ఓనర్‌కు ఇవ్వాల్సింది ఇవ్వకుండా డెవలపర్‌కి ఓనర్‌షిప్‌ రాదని అంటున్నారని పేర్కొన్నారు. రైతుల వద్ద భూములు తీసుకొని.. అభివృద్ధి చేస్తామని చెప్పారని.. అయితే, దాని పక్కనే రైతులకు ప్లాట్లు ఇస్తామన్నారు.

ఇప్పుడు అలాంటివేమీ చేయకుండా చేయడం రైరా చట్టం ప్రకారం మోసమే అవుతుందని సుజనా చౌదరి అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఇలా చాలా మంది రియల్ ఎస్టేట్‌ వ్యాపారులు జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. క్రిమినల్ యాక్ట్ ప్రకారం చూస్తే ఫైనాన్సియల్ ఫెయిల్యూర్‌, చట్టాన్ని ఉల్లంఘించడం రెండు నేరాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

ఇక, అమరావతిని రాజధానిగా కొనసాగించడం కోసం దేశంలోనే అతి పెద్ద న్యాయవాదులను కోర్టులో వాదించడానికి తీసుకొచ్చామని సుజనా చౌదరి తెలిపారు. న్యాయస్థానాల్లో కచ్చితంగా న్యాయం జరుగుతుందని, రైతులు అధైర్య పడొద్దని సూచించారు. వచ్చే ఎన్నికల తర్వాత వచ్చే నూతన ప్రభుత్వంలో కచ్చితంగా అమరావతి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులకు వారి ఊరికి సమీపంలోనే భూములు ఇచ్చే కార్యక్రమం కూడా జరగబోతుందన్నారు.

మరోవైపు అమరావతి ఆర్- 5 జోన్ ఏర్పాటుపై నిరసన చేపట్టిన రైతులపై పోలీసులు చేస్తున్న దౌర్జన్యం చేస్తున్నారని సుజనా చౌదరి మండిపడ్డారు. ఈ విషయంలో త్వరలోనే న్యాయం జరుగుతుందని, అమరావతి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సోమవారం సుప్రీం కోర్టులో అతిపెద్ద న్యాయవాదులు అమరావతి రైతుల పక్షాన వాదనలు వినిపిస్తారని.. తప్పక న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిని చంపేయాలన్న జగన్ ప్రభుత్వ కుట్రలు వీగిపోతాయన్నారు.

అమరావతి రైతుల పాదయాత్రకు బ్రేక్..!

Related Articles

Back to top button