News

sudha murty, Padma Awards 2023: మానవతావాది సుధామూర్తి, బిర్లాకు పద్మభూషణ్.. ఝున్‌ఝున్‌వాలాను వరించిన పద్మశ్రీ – padma awards 2023 kumar mangalam birla, sudha murty gets padma bhushan


Padma Awards 2023: జనవరి 25న కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో దిగ్గజ వ్యాపారవేత్త, ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా, వెటరన్ మార్కెట్ ఇన్వెస్టర్, బిలియనీర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా, రస్నా గ్రూప్ ఫౌండర్ అరీజ్ ఖంబట్ట, ఇన్ఫోసిస్ కో- ఫౌండర్ నారాయణ మూర్తి భార్య, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ సుధామూర్తి ఉన్నారు. ఇందులో రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా, అరీజ్ ఖంబట్టకు మరణానంతరం కేంద్రం పద్మ పురస్కారాలను ప్రకటించింది. కుమార మంగళం బిర్లా, సుధా మూర్తిని పద్మభూషణ్ వరించగా.. రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా, అరీజ్‌కు పద్మశ్రీ వచ్చింది.

కుమార మంగళం బిర్లా ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ అయినప్పటికీ.. దాతృత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈయనకు భారత మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ లభించింది. బిర్లాకు ఇంకా చార్టర్డ్ అకౌంటెంట్ నైపుణ్యాలు కూడా ఉన్నాయి. హిందాల్కో, గ్రేసిమ్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్, ఆదిత్య బిర్లా క్యాపిటల్ వంటి తమ గ్రూప్ కంపెనీలన్ని బోర్డులకు నేతృత్వం వహించేది ఆయనే. బిర్లా లండన్ బిజినెస్ స్కూల్ నుంచి MBA డిగ్రీ చేశారు. తన తండ్రి మరణంతో 28 ఏళ్ల వయసులోనే బిర్లా గ్రూప్ బాధ్యతలను చేపట్టారు. గ్రూప్ టర్నోవర్‌ను కూడా 30 రెట్లు పెంచడం విశేషం. ఇంకా తన వ్యాపారాలను 36 దేశాలకు విస్తరించారు. దేశవిదేశాల్లో కలిపి మొత్తం 40కిపైగా కంపెనీలను దక్కించుకోవడం లేదా వాటాను కొనుగోలు చేయడం చేశారు. ఇప్పటికీ ఇది రికార్డు.

ఒక్కరోజే వేల కోట్లు కోల్పోయిన అదానీ.. కుబేరుల లిస్ట్‌లో కిందికి.. ముకేశ్ అంబానీ

దిగ్గజ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్, బిలియనీర్ అయిన రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా పేరు ఇన్వెస్టర్లకు సుపరిచితమే. ఈయన గతేడాది ఆగస్టు 14న కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూశారు. ఈయనకు ఇప్పుడు మరణానంతరం పద్మశ్రీ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఝున్‌ఝున్‌వాలాను ఇండియా వారెన్ బఫెట్‌గా, బిగ్ బుల్‌గా పిలుచుకుంటారు. తన ప్రతిభతో కేవలం రూ.5000 పెట్టుబడితో స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించిన బిగ్ బుల్.. ఏకంగా వేలకోట్లకు పడగలెత్తారు. 2021 ఫోర్బ్స్ లిస్ట్ ప్రకారం.. భారత్‌లో అత్యంత ధనవంతుల జాబితాలో 36వ స్థానంలో నిలవడం విశేషం.

ఏ బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఎంత ఉండాలి? అన్నింటి లిస్ట్ ఇదే..

టీకొట్టుకు ఇంత డిమాండా? నెలకు రూ.3.25 లక్షల రెంట్.. 45 లక్షల అడ్వాన్స్.. దిమ్మదిరిగిపోయే బిడ్ ఎక్కడో

ఇక సుధా మూర్తి పేరు సుపరిచితమే. విద్యావేత్త, రచయిత అంతకుమించి గొప్ప మానవతామూర్తిగా పేరు పొందారు. ఇన్ఫోసిస్ కో- ఫౌండర్ నారాయణమూర్తి భార్య అయిన సుధా మూర్తి.. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్‌గా కూడా కొనసాగుతున్నారు. ఈమె చాలా సాధారణ జీవితం గడుపుతారు. దాతృత్వ కార్యక్రమాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు. ఈమె కోట్లాది భారతీయులకు స్ఫూర్తి. సుధామూర్తి- నారాయణమూర్తి కుమార్తె అక్షతా మూర్తి.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భార్య. వీరు ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. గతేడాదే బ్రిటన్ ప్రధానిగా ఎన్నికయ్యారు రిషి సునాక్.

  • Read Latest Business News and Telugu News

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

Also Read: అదానీ గుట్టు బట్టబయలు.. ఒక్కరోజే రూ.48 వేల కోట్ల లాస్.. అసలేమైంది?

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు ఇవే..

Advertisement

Related Articles

Back to top button