News

Stress – Physical Relation: ‘నో మోర్ స్ట్రెస్ ప్లీజ్’.. టెన్షన్ పడితే లైంగిక జీవితం ఖల్లాసే.. ఇంకా ఎన్నో సమస్యలు.. | Stress management: tension can anxiety can affect brain heart bone and male fertility

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Mar 05, 2023 | 1:41 PM

టెన్షన్ పడొద్దు మామ అంటారు పెద్దలు.. క్లిష్ట పరిస్థితులు వస్తే ధైర్యంగా ఎదుర్కొవాలే తప్ప.. దాని గురించి చింతిస్తూ భయంలో మునిగితేలడం, ఆందోళన పడటం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఇవి మనస్సును పూర్తిగా డామినేట్ చేయడం ప్రారంభిస్తే.. చాలా సమస్యలు వస్తాయి.

Mar 05, 2023 | 1:41 PM

ఆందోళన.. ఒత్తిడి.. భయం.. ఇవన్నీ మనల్ని ముందుకు సాగకుండా గందరగోళంలో పడేస్తాయి. అందుకే.. ఆందోళనను పక్కన పెట్టండి గురూ అంటారు.. పెద్దలు.. క్లిష్ట పరిస్థితులు వస్తే ధైర్యంగా ఎదుర్కొవాలే తప్ప.. దాని గురించి చింతిస్తూ భయంలో మునిగితేలడం, ఆందోళన పడటం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఇవి మనస్సును పూర్తిగా డామినేట్ చేయడం ప్రారంభిస్తే చాలా సమస్యలు వస్తాయి.

టెన్షన్ తీసుకోవడం వల్ల సమస్య తగ్గడానికి బదులు పెరగడం ప్రారంభమవుతుంది. ఇది మన శరీరంలోని అనేక భాగాలకు హానికరంగా పరిగణించబడుతుంది. ఒత్తిడి వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎక్కువ టెన్షన్ తీసుకోవడం వల్ల.. దాని మొదటి ప్రభావం మన మెదడుపై పడుతుంది. దీని కారణంగా ఏకాగ్రత లేకపోవడం, డిప్రెషన్, ఆందోళన, మూడ్ స్వింగ్స్, చిరాకు, గబరపాటు, చెమటలు పట్టడం వంటి అనేక సమస్యలు వస్తాయి.

ఒత్తిడి మన ఎముకలు, కండరాలను కూడా ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా ఇది వాపు, కండరాల నొప్పి, కండరాల ఉద్రిక్తత, కండరాల బిగుతు, కీళ్ల నొప్పులకు కారణమవుతుంది.

ఒత్తిడి కారణంగా ప్రేగు పనితీరు ప్రభావితమవుతుంది. ఇది పోషకాలను గ్రహించడం, అతిసారం, మలబద్ధకం, అజీర్ణం, అపానవాయువు, కడుపు నొప్పి వంటి సమస్యలను కలిగిస్తుంది.

Advertisement
వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడటానికి మెరుగైన రోగనిరోధక శక్తిని కలిగి ఉండటం చాలా ముఖ్యం. రోగనిరోధక శక్తి లేకపోతే వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ఎక్కువ టెన్షన్ తీసుకోవడం వల్ల కలిగే ప్రభావం మన రోగనిరోధక శక్తిపై పడుతుంది. కణజాలం వ్యవస్థ దెబ్బతిని, లైంగిక జీవితంపై ప్రభావం చూపుతుంది.

ఒత్తిడి కారణంగా.. కొలెస్ట్రాల్ పెరుగుదల, అధిక రక్తపోటు వంటి సమస్యలు వస్తాయి. ఇది గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. అనేక సందర్భాల్లో ఇది ప్రాణాంతకం అని కూడా నిరూపితమైంది.

దీని గురించి అందరికీ తెలియకపోవచ్చు.. ఒత్తిడి మీ పునరుత్పత్తి వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది.. లైంగిక కోరికలు తగ్గుతాయి. ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ పెరుగుతుంది. ఫలితంగా శీఘ్రస్కలనం, లైంగిక జీవితాన్ని ఆస్వాదించలేకపోవడం, సంతానోత్పత్తి కలగకపోవడం లాంటి సమస్యలు మొదలవుతాయి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Related Articles

Back to top button