News

stock market live updates, Breakout Stocks: మార్కెట్లలో లాభాలు.. బ్రేకవుట్ స్టాక్స్ ఇవే.. రికార్డు స్థాయిలో జంప్.. ఇవి కొంటే! – stocks with price volume breakout including kpit technologies limited


Breakout Stocks: స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 120 పాయింట్లు పెరిగి 61 వేల 530 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 18 వేల 270 వద్ద కొనసాగుతోంది. బ్యాంకింగ్ ఇండెక్స్ లాభాల్లో ఉంది. అయితే మార్కెట్లు లాభాల్లో ఉన్న తరుణంలో కొన్ని స్టాక్స్ ప్రైస్ వాల్యూమ్ బ్రేకవుట్‌ను నమోదు చేశాయి. ఆ స్టాక్స్ ఏంటో? ఎంత పెరిగాయో చూద్దాం.

 

బ్రేకవుట్ స్టాక్స్
Breakout Stocks: అంతర్జాతీయంగా బలమైన సంకేతాల నడుమ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం సెషన్‌లో లాభాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 50 మంచి లాభాల్లో ప్రారంభమైంది. హాలిడే సీజన్‌లో ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న అంచనాలున్నప్పటికీ మంగళవారం రోజు.. అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. నాస్‌డాక్ కాంపోజిట్ సూచీ 1.36 శాతం పెరగ్గా.. డౌ జోన్స్ ఏకంగా 1.18 శాతం లాభపడింది. ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్ 1.36 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 మాత్రం రెండున్నర నెలల గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.35 శాతం పెరగ్గా.. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 0.65 శాతం లాభపడింది.

నవంబర్ 22 డేటా ప్రకారం.. ఫారెన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (FII) నికర అమ్మకందారులుగా ఉండగా.. డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (DII) నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. FIIలు రూ.697.83 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా.. అదే సమయంలో DIIలు రూ. 636.39 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడం విశేషం.

  • Also Read: లక్షను రూ.65 లక్షలు చేసిన స్టాక్ ఇదే.. ఇన్వెస్టర్లపై కనకవర్షం.. మీ దగ్గరుందా మరి?

కొద్దిరోజులుగా తీవ్ర ఒడుదొడుకుల మధ్య ట్రేడయిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు క్రితం సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. అదే ఊపులో ఇవాళ కూడా లాభాల్లోనే కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త రాసే సమయానికి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 100 పాయింట్లకుపైగా పెరిగి 61 వేల 530 వద్ద కొనసాగుతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 30 పాయింట్లు పెరిగి 18 వేల 270 వద్ద ట్రేడవుతోంది. బ్యాంకింగ్ ఇండెక్స్ రాణిస్తోంది. అయితే మార్కెట్లు లాభాల్లో ఉన్న తరుణంలో ఈ స్టాక్స్ ప్రైస్ వాల్యూమ్ బ్రేకవుట్‌ను నమోదు చేశాయి. వీటిపై రాబోయే సెషన్లలో ఓ లుక్కేయొచ్చు. అవేంటో చూద్దాం.

స్టాక్ పేరుCMP (రూపాయల్లో)ధరలో మార్పు (శాతాల్లో)వాల్యూమ్
గుజరాత్ నర్మదా వ్యాలీ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్628.86.251,81,300
RHI మాగ్నెసిటా ఇండియా లిమిటెడ్79512.833,63,438
మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్892.531,17,70,191
KPIT టెక్నాలజీస్ లిమిటెడ్713.44.437,00,060
TCNS క్లాతింగ్ కంపెనీ లిమిటెడ్601.77.311,14,184

భారతదేశపు నంబర్ 1 ఇన్వెస్ట్‌మెంట్ మ్యాగజైన్ దలాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్‌మెంట్ జర్నల్ ఈ ఆర్టికల్‌ను అందించింది. విన్నింగ్ స్టాక్స్, సిఫార్సులకు సంబంధించిన అప్‌డేట్స్ క్రమం తప్పకుండా పొందడం కోసం ఈ దలాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయండి.

Disclaimer: This above is third party content and TIL hereby disclaims any and all warranties, express or implied, relating to the same. TIL does not guarantee, vouch for or endorse any of the above content or its accuracy nor is responsible for it in any manner whatsoever. The content does not constitute any investment advice or solicitation of any kind. Users are advised to check with certified experts before taking any investment decision and take all steps necessary to ascertain that any information and content provided is correct, updated verified.

  • Read Latest Business News and Telugu News

Also Read: కోహ్లీ, అనుష్కల ఫ్లాట్.. నెల అద్దె తెలిస్తే దిమ్మదిరిగిపోద్ది.. లక్షలకు లక్షలు దానికే..!

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Advertisement

Related Articles

Back to top button