News
sri lanka odi defeats, IND vs SL: కోల్కతా వన్డే తర్వాత.. భారత్ చెత్త రికార్డ్ శ్రీలంక ఖాతాలోకి.. – sri lanka goes past india to hold the record of most defeats in odis
ఈ ఓటమితో శ్రీలంక ఖాతాలో రెండు చెత్త రికార్డులు చేరాయి. ఓ ప్రత్యర్థి చేతిలో అత్యధిక వన్డేల్లో ఓడిన జట్టుగా న్యూజిలాండ్ రికార్డును లంక సమం చేసింది. భారత్ చేతిలో శ్రీలంక 95 వన్డేల్లో ఓడగా.. ఆస్ట్రేలియా చేతిలో కివీస్ కూడా 95 మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. ఇరు జట్లు ఇప్పటి వరకూ 163 వన్డేలు ఆడగా.. శ్రీలంక 57 మ్యాచ్ల్లో గెలుపొందగా.. 11 మ్యాచ్ల్లో ఫలితం తేలదు. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. టీ20ల్లో సైతం అత్యధిక ఓటములను చవిచూసిన జట్టు కూడా శ్రీలంక (94) కావడం గమనార్హం.
అంతే కాదు వన్డేల్లో అత్యధిక మ్యాచ్ల్లో ఓడిన జట్టుగా భారత్ పేరిట ఉన్న చెత్త రికార్డ్ ఇప్పుడు శ్రీలంక ఖాతాలోకి వెళ్లింది. ఇప్పటి వరకూ భారత్ 436 వన్డేల్లో ఓడగా.. కోల్కతాలో ఓటమితో శ్రీలంక ఓటముల సంఖ్య 437కి చేరుకుంది. శ్రీలంక ఇప్పటి వరకూ 880 మ్యాచ్లు ఆడగా.. భారత్ 1022 వన్డేలు ఆడింది. ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్న పాకిస్థాన్ 947 వన్డేలు ఆడి 419 మ్యాచ్ల్లో ఓడింది.
వన్డేల్లో భారత్ విజయాల శాతం 55 కాగా.. పాకిస్థాన్ విజయాల శాతం 54కిపైగా ఉంది. శ్రీలంక విషయానికి వస్తే ఆ జట్టు విజయాల శాతం 48 కంటే తక్కువగా ఉంది. వన్డేల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టు (975 మ్యాచ్ల్లో 592 విజయాలు) ఆస్ట్రేలియా కాగా.. అత్యధిక విజయాల శాతం ఉన్న జట్టుగా సౌతాఫ్రికా (63.41 శాతం) తొలి స్థానంలో ఉంది.
Read More Sports News And Telugu News