News

Sri Chaitanya College, Narsingi: క్లాస్‌రూమ్‌లోనే ఉరేసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. శ్రీ చైతన్య కాలేజీలో కలకలం – inter student suicide in sri chaitanya college in narsingi


Narsingi: హైదరాబాద్‌లోని నార్సింగిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. స్వాతిక్ అనే స్టూడెంట్ రాత్రి పది గంటల సమయంలో క్లాస్‌రూమ్‌లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించి కాలేజీ తీరుపై తీవ్ర విమర్శలొస్తున్నాయి.

స్వాతిక్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న కాలేజీ సిబ్బంది పట్టించుకోలేదనే ఆరోపణలు కుటుంబసభ్యులు, తోటి విద్యార్థుల నుంచి వినిపిస్తోన్నాయి. కాలేజీ సిబ్బంది పట్టించుకోకపోవడంతో.. బయట బైకర్‌ను లిఫ్ట్ అడిగి స్వాతిక్‌ను తోటి విద్యార్థులు హాస్పిటల్‌కు తరలించారు. ఆస్పత్రికి తరలించేలోపే స్వాతిక్ మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం స్వాతిక్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి పోలీసులు తరలించారు.

స్వాతిక్ మృతితో కాలేజీలో ఆందోళనక పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులు, కుటుంబసభ్యులు కాలేజీలో ఆందోళనకు దిగారు. సరిగ్గా మార్కులు రావడం లేదని కాలేజీ యాజమాన్యం ఒత్తిడి పెట్టిందని, అది భరించలేకే స్వాతిక్ బలవన్మరణానికి పాల్పడినట్లు విద్యార్థులు చెబుతున్నారు. కనీసం యాజమాన్యం ఆస్పత్రికి తీసుకెళ్లలేదని ఆరోపిస్తున్నారు. గతంలో లెక్చరర్స్ కొట్టడంతో 15 రోజులు స్వాతిక్ ఆస్పత్రి పాలయ్యాడని, స్వాతిక్‌ను ఏం అనొద్దని గతంలోనే యాజమాన్యానికి చెప్పామని తల్లిదండ్రులు అంటున్నారు. మెంటల్ స్ట్రెస్‌కి గురి చేయడం వల్లే స్వాతిక్ ఆత్మహత్య చేసుకున్నాడని, తమ కుమారుడు ఆత్మహత్యకు కాలేజీ యాజమాన్యమే కారణమంటున్నారు.

స్వాతిక్ మృతితో కాలేజీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కాలేజీ హాస్టల్‌ను పోలీసులు ఖాళీ చేయించి విద్యార్ధులను ఇంటికి పంపిస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదులో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. విచారణ చేపట్టి యాజమాన్యంపై చర్యలు తీసుకుటామని పోలీసులు చెబుతున్నారు. మార్కుల పేరుతో తమపై బాగా ఒత్తిడి పెడుతున్నారని, చాలామంది ఒత్తిడి భరించలేకపోతున్నారని విద్యార్థులు చెబుతున్నారు.

Related Articles

Back to top button