News

SRH vs RCB: క్లాసెన్ పోరాటం వృధా.. సన్‌రైజర్స్‌‌పై బెంగళూరు ఘన విజయం.. కింగ్ కోహ్లీ ఖాతాలో మరో సెంచరీ.. – Telugu News | Virat Kohli’s long waiting century leads Royal Challengers Bangalore to defeat Sunrisers Hyderabad by 8 wickets


SRH vs RCB: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా జరిగిన 65 మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ సెంచరీతో మెరిసాడు. ఫలితంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో భారీ విజయం అందుకుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ఆర్‌సీబీ తన ప్లేఆఫ్ ఆవకాశాలను..

SRH vs RCB: క్లాసెన్ పోరాటం వృధా.. సన్‌రైజర్స్‌‌పై బెంగళూరు ఘన విజయం.. కింగ్ కోహ్లీ ఖాతాలో మరో సెంచరీ..

RCB beats SRH by 8 Wickets

SRH vs RCB: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా జరిగిన 65 మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ సెంచరీతో మెరిసాడు. ఫలితంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో భారీ విజయం అందుకుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ఆర్‌సీబీ తన ప్లేఆఫ్ ఆవకాశాలను కాపాడుకుంది. అలాగే పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో నాల్గో స్థానానికి చేరుకుంది. ఈ క్రమంలోనే తన చివరి మ్యాచ్‌లో కూడా గుజరాత్ టైటాన్స్‌పై గెలిస్తే ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించడం ఖాయం. ఇక హైదరాబాద్ వేదికగా జరిగిన నేటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.

ఈ క్రమంలో ఆరెంజ్ ఆర్మీ తరఫున హెన్రిచ్ క్లాసెన్(104, 51 బంతుల్లో; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) సూపర్ సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ మార్క్రమ్(18) మరోసారి విఫలమైనా.. హ్యారీ బ్రూక్ 27(నాటౌట్) పరుగులతో పర్వాలేదనిపించాడు. ఆర్‌సీబీ బౌలర్లలో మైకేల్ బ్రేస్‌వెల్ 2, హర్షల్ పటేల్, షాబాజ్ అహ్మద్, మొహ్మద్ సిరాజ్ తలో వికెట్ తీసుకున్నారు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఆర్‌సీబీకి ఎదురులేని శుభారంభంతో పాటు 172 పరుగుల భాగస్వామ్యం లభించింది. కెప్టెన్ ఫాఫ్ డూ ప్లెసిస్(71), కోహ్లీ(100) నుంచి అద్భుతమైన ఇన్నింగ్స్ వచ్చాయి. ఇక వీరిద్దరు పెవీలియన్ చేరాక మిగిలి ఉన్న లక్ష్యాన్ని గ్లెన్ మ్యాక్స్‌వెల్(5, నాటౌట్), మైకేల్ బ్రేస్‌వెల్(4, నాటౌట్) పూర్తి చేశారు. ఫలితంగా ఆర్‌సీబీ ఈ మ్యాచ్‌లో గెలిచి తన ప్లేఆఫ్ ఆశలను కాపాడుకుంది.

ఇవి కూడా చదవండి



కాగా, ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన కింగ్ కోహ్లీ ఐపీఎల్ క్రికెట్‌లో దాదాపు 4వ సంవత్సరాల గ్యాప్‌తో 6వ శతకాన్ని నమోదు చేసుకున్నాడు. అలాగే ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసినట్లుగా తన మాజీ టీమ్‌మేట్ క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డును కూడా సమం చేశాడు. ఇవే కాక ఫాఫ్ డూ ప్లెసిస్(71), కోహ్లీ(100) నుంచి వచ్చిన అద్బుతమైన భాగస్వామ్యం.. ఐపీఎల్‌లో నాల్గో అతి పెద్ద పార్ట్నర్‌షిప్‌గా నిలిచింది. ఇదిలా ఉండగా ఆర్‌సీబీ తన చివరి మ్యాచ్‌ను ఈ నెల 21న గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది. ఆ మ్యాచ్‌లో కూడా ఆర్‌సీబీ గెలిస్తే ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో ప్రవేశించే అవకాశం ఉంటుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Related Articles

Back to top button