spouse refusing sex, Allahabad High Court: జీవిత భాగస్వామితో శృంగారానికి నిరాకరించడం మానసిక క్రూరత్వమే.. అలహాబాద్ హైకోర్టు – allahabad high court says refusing sex to spouse for long time mental cruelty
దిగువ కోర్టు హైపర్-టెక్నికల్ విధానాన్ని” అవలంబించిందని, యాదవ్ కేసును కొట్టివేసిందని అభిప్రాయపడింది. కేసు వివరాల్లోకి వెళ్తే రవీంద్ర ప్రతాప్ యాదవ్, ఆశాదేవిలకు 1979లో వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది రోజులకే భార్య ప్రవర్తనలో మార్పులు రాగా.. భర్తతో కలిసుండటానికి నచ్చేది కాదు. కొద్ది రోజులకే ఆమె పుట్టింటికి వెళ్లిపోవడంతో ఆరు నెలల తర్వాత ఆమెను ఒప్పించి తీసుకొచ్చేందుకు రవీంద్ర చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. భర్త వెంట రావడానికి ఆశాదేవి నిరాకరించింది. ఆమెలో ఎప్పటికైనా మార్పు రాకపోతుందా? అని రవీంద్ర ప్రతాప్ వేచిచూశాడు.
దాదాపు పదిహేనేళ్లు నిరీక్షించిన ఆయన.. చివరకు పెద్దల పంచాయతీకి తన సమస్యను తీసుకొచ్చాడు. దీంతో 1994 జులైలో పరస్పర అంగీకారంతో విడిపోవడానికి పంచాయతీ అంగీకరించాయి. భార్యకు భరణం కింద రూ. 22,000 చెల్లించడానికి ఒప్పుకుని, ఆ మొత్తాన్ని చెల్లించాడు. అయితే, మానసిక క్రూరత్వం, వైవాహిక బంధాన్ని గౌరవించకపోవడం వంటి కారణాలతో ఆయన కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణకు ఆమె హాజరుకాకపోవడంతో హిందూ వివాహ చట్టం 1955 సెక్షన్ 13ని పేర్కొంటూ అతడి అభ్యర్థనను 2005లో వారణాసి కుటుంబన్యాయస్థానం కొట్టివేసింది.
దీనిని అలహాబాద్ హైకోర్టులో యాదవ్ సవాలు చేశారు. ప్రధానంగా పెద్దల పంచాయితీలో విడిపోవడానికి పరస్పరం అంగీకారించామని, తనకు విడాకులు ఇవ్వాలని కోరాడు. వైవాహిక బంధాన్ని గౌరవించలేదని, తన బాధ్యతలు పంచుకోలేదని, శృంగారానికి నిరాకరించి మానసిక క్రూరత్వానికి పాల్పడిందని ఆరోపించారు. దీనిపై అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సునీత కుమార్, జస్టిస్ ఐవీ రాజేంద్ర కుమార్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది.
‘జీవిత భాగస్వామి అతడు లేదా ఆమెను తగిన కారణం లేకుండా ఎక్కువ కాలం లైంగిక చర్యలకు నిరాకరించడం నిస్సందేహంగా మానసిక క్రూరత్వానికి సమానం… జీవిత భాగస్వామికి ఆమోదయోగ్యమైన అభిప్రాయం లేనందున వివాహానికి సంబంధించిన పార్టీలను శాశ్వతంగా ఉంచడానికి ప్రయత్నించినా ఏమీ ప్రయోజనం లేదు.. వారి వైవాహిక బంధం పూర్తిగా విచ్ఛిన్నమయ్యింది’ అని 2006లో సుప్రీంకోర్టు ఓ విడాకుల కేసులో ఇచ్చిన తీర్పును ప్రస్తావించింది. మానసిక క్రూరత్వానికి సంబంధించిన అంశంపై 2006లో ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ.. కుటుంబ న్యాయస్థానం ఆదేశాల్లో తప్పులున్నాయని గుర్తించి దానిని పక్కన పెట్టింది.
Read More Latest National News And Telugu News