News
south central railway, Cancelled Trains: తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఈ మార్గాల్లో 14 రైళ్లు రద్దు – south central railway officials announced that 14 trains in telugu states have been cancelled
విజయవాడ – గూడూరు (12744) మధ్య నడిచే ఈ సర్వీసును ఈ నెల 3 నుంచి 6 వరకు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పష్టం చేశారు. గూడూరు – విజయవాడ ట్రైన్ (12743) నేటి నుంచి ( మార్చి 4) 7వ తేదీ వరకు రద్దు చేశారు. కాజీపేట-తిరుపతి (07091) వారంతపు రైలును ను ఈ నెల 7న రద్దు చేశారు. తిరుపతి – కాజీపేట వీక్లీ ట్రైన్ (07092)ను ఈ నెల 7న రద్దు చేశారు. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ – బిట్రగుంట్ర మధ్య నడిచే ట్రైన్ (17238)ను నేటి నుంచి మార్చి 12 వరకు రద్దు చేశారు. బిట్రగుంట-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ట్రైన్ (17237) ను ఈ నెల 4 నుంచి 12 వరకు రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు.
విజయవాడ – గూడూరు ట్రైన్ (17260)ను గూడూరు – విజయవాడ ట్రైన్ (17259)ను ఈ నెల 4 నుంచి 6వ వరకు రద్దు చేశారు. విజయవాడ-MGR చెన్నై సెంట్రల్ ట్రైన్ (12711)ను, నెల్లూరు- ఎంజీఆర్ సెంట్రల్ మధ్య నడిచే ట్రైన్‌ను ఈ నెల 4 నుంచి 6 వరకు రద్దు చేశారు. బిట్రగుంట – గూడూరు మధ్య ట్రైన్‌ను పాక్షికంగా రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. సుల్లూరుపేట – నెల్లూరు (06745), నెల్లూరు – సుల్లూరు పేట (06746), నెల్లూరు – సుల్లూరుపేట (06748), సుల్లూరుపేట – నెల్లూరు (06751) గూడూరు – సుల్లూరుపేట (06750) మధ్య నడిచే రైళ్లను నేటి నుంచి మార్చి 7 వరకు రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు.
- Read More Telangana News And Telugu News