south central railway, సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పూర్తి షెడ్యూల్ ఇదే.. విడుదల చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే – south central railway released full schedule of secunderabad to tirupati vande bharat express
8వ తేదీ ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో వందే భారత్ ట్రైన్‌ను మోదీ ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. 8న మోదీ ప్రారంభించినా ఆ రోజు ప్రయాణికులను అనుమతించరు. 9వ తేదీ నుంచి సర్వీసులు అందించనుంది. ఈ క్రమంలో ట్రైన్ నెంబర్లతో పాటు ఏయే స్టేషన్‌లలో ఆగుతుంది? ఏ స్టేషన్‌కు ఏ టైమ్‌కు చేరుకుంటుంది? అనే వివరాలతో కూడిన షెడ్యూల్‌ను దక్షిణ మధ్య రైల్వే అధికారికంగా వెల్లడించింది.
మంగళవారం తప్ప మిగతా రోజుల్లో సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు తిరుగుతుంది. మంగళవారం మెయింటనెన్స్ కోసం ఆపేయనున్నారు. సికింద్రాబాద్-తిరుపతి(ట్రైన్ నెంబర్ 20701) సికింద్రాబాద్‌లో ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. మధ్యలో నల్లగొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు రైల్వే స్టేషన్లలలో మాత్రమే ఈ ట్రైన్ ఆగనుంది. నల్లగొండకు ఉదయం 7.19 గంటలకు, గుంటూరుకు ఉదయం 9.45కు, ఒంగోలుకు ఉదయం 11.08కు, నెల్లూరుకు మధ్యాహ్నం 12.29 గంటలకు చేరుకుంటుంది.
ఇక తిరుగు ప్రయాణంలో తిరుపతి-సికింద్రాబాద్(ట్రైన్ నెంబర్ 20702) తిరుపతిలో మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి రాత్రి 11.45కు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. ఈ ట్రైన్ సాయంత్రం 5.20 గంటలకు నెల్లూరు, 6.30కు ఒంగోలు, 7.45కు గుంటూరు, రాత్రి 10.10 గంటలకు నల్లగొండ చేరుకుంటుంది. మంగళవారం మినహా మిగతా రోజుల్లో ఈ ట్రైన్ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు.
అయితే ఈ ట్రైన్ ఛార్జీల వివరాలు ఇంకా బయటకు రాలేదు. త్వరలోనే బుకింగ్స్‌తో పాటు ఛార్జీల వివరాలను రైల్వేశాఖ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో పొందుపర్చనుంది. ప్రస్తుతం సికింద్రాబాద్-తిరుపతి మధ్య ట్రైన్ ప్రయాణం 11 లేదా 12 గంటలు పడుతుంది. వందే భారత్ ట్రైన్ ప్రయాణం 9 గంటలు మాత్రమే పట్టనుంది. దాదాపు 3 గంటల ప్రయాణ సమయం తగ్గనుంది.
- Read More Telangana News And Telugu News