News
Software Suicide In Hyderabad,ప్రాణంగా ప్రేమించిన వాడు మరో యువతితో.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కఠిన నిర్ణయం! – software employee commits suicide due to love failure in jagadgirigutta hyderabad
మౌనిక కొంతకాలంగా సాయికుమార్ అనే యువకుడితో ప్రేమలో ఉంది. అతడినే పెళ్లి చేసుకుంటానని రెండు నెలల కిందట తల్లిదండ్రులకు చెప్పింది. అయితే వీరి ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించారు. ఈక్రమంలో ప్రేమించిన యువకుడు సాయి కుమార్ మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఆ విషయం తెలిసిన మౌనిక తీవ్ర మనస్తాపానికి గురైంది. ప్రతిరోజు రాత్రి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడే మౌనిక.. సోమవారం (సెప్టెంబర్ 11) చేయలేదు. దీంతో రాత్రి 10 గంటల సమయంలో తల్లిదండ్రులే కూతురికి ఫోన్ చేశారు. అయినా ఫోన్ లిప్ట్ చేయలేదు. మంగళవారం ఉదయం ఫోన్ చేసినా.. స్పందన లేదు. దీంతో మౌనిక ఫ్రెండ్‌కు రాజనర్సు ఫోన్ చేశాడు. మౌనిక ఫోన్ లిఫ్ట్ చేయటం లేదని.. ఏం జరిగిందో కనుక్కోవాలని చెప్పాడు.
దీంతో ఆమె తన స్నేహితుడిని మౌనిక ఉండే గదికి పంపించింది. గది తలుపులు తెరిచి చూడగా.. మౌనిక విగతజీవిగా పడి ఉంది. పక్కనే పురుగుల మందు డబ్బా కనపిపించటంతో వెంటనే కుటుంబ సభ్యులకు, 108కు సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది వచ్చి ఆమె చనిపోయినట్లు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మౌనిక మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.