Skill Development Case,Nara Lokesh: ఢిల్లీకి చేరిన చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం.. హస్తినకు వెళ్లిన నారా లోకేశ్ – nara lokesh went to delhi on chandrababus arrest case
వీటితోపాటు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమమని నేషనల్ మీడియాలోనూ ప్రజెంటేషన్ ఇవ్వాలని.. లోకేశ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ విషయం జాతీయ మీడియాలో రావడం.. రాజకీయ కక్షతోనే ఆయనను అరెస్టు చేశారని వివిధ పార్టీల పార్టీల నేతలు ప్రకటించిన నేపథ్యంలో దీన్ని జాతీయ స్థాయిలోనే తేల్చుకోవాలని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పరిస్థితులను కూడా జాతీయ మీడియా ముందు ఉంచనున్నారు. దాడులు చేసిన వారిని వదిలేసి బాధితులపైనే కేసులు పెడుతున్నారని ఆరోపిస్తున్న టీడీపీ నేతలు.. జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల కాలంలో ఏపీలో జరిగినన్ని అరాచకాలు దేశంలో ఎక్కడా జరిగి ఉండవని వాటిని నేషనల్ మీడియాకు వివరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం ఆఫీస్‌పై దాడి చేసిన వారిపై కేసులు పెట్టకపోవడం, అంగళ్లు, పుంగనూరులో చంద్రబాబు నిర్వహించిన ర్యాలీలపై రాళ్ల దాడులు చేయడం.. తిరిగి ఆ దాడులపై చంద్రబాబుపైనే హత్యాయత్నం కేసులు నమోదు చేయడం వంటి వాటిని దేశం ముందు ఉంచాలని చూస్తున్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దారి తప్పిందన్న విషయాన్ని జాతీయ స్థాయిలో హైలెట్ చేయాలని లోకేశ్ భావిస్తున్నట్లు తెలుగుదేశం వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
మరోవైపు.. చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైలులో భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్న వేళ తాజాగా ఓ పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటివరకు జైలు సూపరింటెండెంట్‌గా ఉన్న రాహుల్.. ఆకస్మికంగా లాంగ్ లీవ్ పెట్టారు. అయితే ఆ సెలవులు తన వ్యక్తిగత అవసరాల కోసమని.. తన భార్య అనారోగ్యంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించినట్లు జైలు సూపరింటెండెంట్ చెప్పినట్లు జైలు అధికారులు పేర్కొన్నారు.