Sivaji Bigg Boss,Bigg Boss Today Promo: ఇదేం ర్యాగింగ్ అయ్యా శ్రీకాంత్.. శివాజీని ఓ ఆట ఆడుకున్నావుగా – bigg boss 7 telugu promo actor srikanth hilarious fun with sivaji today
ఒక్క ఎపిసోడ్ కూడా
ఇక వచ్చీ రాగానే తమ సినిమాలో తెగ వైరల్ అయిన ‘లింగ్ లింగ్ లింగ్ లింగిడీ’ సాంగ్‌కి శివానీ, రాహుల్ విజయ్ స్టెప్పులేశారు. ఇక బిగ్‌బాస్ చూస్తారా అని నాగార్జున అడగ్గానే అయ్యో సీజన్ 1 నుంచి ఇప్పటివరకు ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూశానంటూ శ్రీకాంత్ చెప్పాడు. ఇక తర్వాత తమ సినిమా విశేషాల గురించి శ్రీకాంత్ వివరించాడు.
ఇక తర్వాత మీలో హుషారు రావాలని నా ఫ్రెండ్స్‌ని తీసుకువచ్చాను.. శివాజీకి అయితే బెస్ట్ ఫ్రెండ్ అంటూ నాగార్జున అన్నారు. ఇక శివాజీని చూడగానే రేయ్ బావా పక్కకి రా అంటూ చాలా ఆప్యాయంగా పలకరించాడు శ్రీకాంత్. ఎలా ఉన్నావ్‌రా బాబు ఇన్ని రోజులు అంటూ కామెడీ చేశాడు శ్రీకాంత్.
ఏంటి శివాజీ చిన్నోడా
గేమ్ అయితే చాలా బ్రహ్మండంగా అడుతున్నావ్ శివాజీ అంటూ శ్రీకాంత్ ప్రశంసించాడు. ఇక తర్వాత శోభాని కన్నడలో ఎలా ఉన్నావ్ అంటూ శ్రీకాంత్ అడిగాడు. ఇక ఎప్పటిలానే కన్నడలో మొదలపెట్టింది శోభా .. దీంతో మొదలుపెట్టారా అంటూ నాగార్జున కౌంటర్ ఇచ్చారు. శోభా.. పటాకా సార్.. ఫైర్ అండీ బాగా క్రాకర్‌లా పేలుతుంది అంటూ శ్రీకాంత్ ప్రశంసించాడు. ఇంతలో మధ్యలో లేచి సార్ ఈళ్లు ఎవరు సార్.. ఎందుకొచ్చారంటూ శివాజీ అడిగాడు. నిన్ను చూడటానికి వచ్చాంరా అంటూ శ్రీకాంత్ పంచ్ ఇచ్చాడు.
ఇక తర్వాత మిమ్మల్ని జిమ్‌లో చూసి మీరు శివాజీ కంటే చిన్నోడు అనుకున్నా అన్నా అంటూ శ్రీకాంత్‌తో అంబటి అర్జున్అన్నాడు. దీంతో వెంటనే ఊరుకోవయ్యా మాటి మాటికి ఏజ్ గురించి మాట్లాడతావ్ అంటూ శివాజీ కామెడీ చేశాడు. అవును.. అర్జున్ నిజమే బయట కూడా శివాజీ నా కంటే పెద్దోడనే అనుకుంటారు అందరూ అంటూ ఇంకో కౌంటర్ వేశాడు శ్రీకాంత్. ఈ దెబ్బకి తలుపులు తీయండి సార్.. వెళ్లిపోతా నేను తట్టుకోలేకపోతున్నాను ఈ నరకం అంటూ శివాజీ అనగానే అందరూ తెగ నవ్వుకున్నారు. ఈ ప్రోమోపై ఓ లుక్కేయండి.
- Read latest TV News and Movie Updates