Sivaji Bigg Boss,Bigg Boss Today: ‘ఏం డైలాగ్ బాబు గారు ఇది’.. యావర్ ఏడుస్తుంటే శివాజీ ఒట్టేశాడయ్యా మళ్లీ! – bigg boss 7 telugu today episode sivaji consoles prince yawar when he broke down in tears
మరి అప్పుడు తెలీకుండా తప్పు చేసిన నాది మిస్టేక్ అవుతుందా లేక చూడకుండా ఉన్న సంచాలక్‌ది మిస్టేక్ అవుతుందా అని లా పాయింట్ లాగాడు యావర్. దీనికి వాదించలేక సరే నేను సంచాలక్‌గా తప్పు చేశా నన్ను నామినేట్ చేసుకో.. నువ్వు తెలీకుండానైనా ఫౌల్ గేమ్ ఆడావ్.. సో నిన్ను నామినేట్ చేస్తున్నానంటూ అమర్ వేసేశాడు. వీళ్ల వాదన మధ్యలో ప్రియాంక దూరడంతో యావర్ గట్టిగా ఫైర్ అయ్యాడు.
యావర్ ఏడుపు.. శివాజీ ఓదార్పు
అయితే ఆ తర్వాత యావర్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. సిగరెట్ తాగుతూ ఒంటరిగా కూర్చున్నాడు. సరిగ్గా అప్పుడే శివాజీ అక్కడికి వచ్చాడు. నీకు చెప్పా 10వ వారమే.. ఈ ఐదువారాలు చాలా ముఖ్యం.. కోపపడకని అంటూ శివాజీ అన్నాడు. నేను వెళ్లిపోతా అన్నా.. అంటూ యావర్ అన్నాడు. అది రాంగ్ మీ అన్నకి మాటిచ్చినవ్.. నా బిడ్డల మీద ఒట్టు.. ఫోర్స్‌గా ఉన్నాను నేను ఇక్కడ.. మీరు హ్యాండిల్ చేయలేరనే ఉన్నా .. ఎందుకు ఏడుస్తున్నావ్‌రా.. చేతకాదా ఆడటం.. లైఫ్‌లో మళ్లీ ఇలాంటి సిట్యువేషన్ రాదు.. నేను ఇలా చేసుకున్నా తెలియని వయసులో కోపంతో.. అంటూ శివాజీ క్లాస్ పీకాడు. దీంతో అమర్ అలా ఎలా నామినేట్ చేస్తాడన్నా.. సంచాలక్ వాడే కదా.. తప్పు వాడిది కదా అని యావర్ చెప్పాడు. ఆడియన్స్ చూస్తారు కదరా.. అంటూ శివాజీ ఓదార్చాడు.
అయితే యావర్ ఎమోషనల్ అయినప్పుడు శివాజీ ఓదార్చడం, దగ్గరికి తీసుకోవడం అంతా బాగానే ఉంది. కానీ ఆ సమయంలో శివాజీ కొట్టే డైలాగులు మాత్రం ఈ మధ్య కాస్త అతిగా ఉన్నాయి. ఉదాహరణికి ప్రశాంత్, యావర్ హౌస్‌లో పరిస్థితులను హ్యాండిల్ చేయలేరనే తాను ఇక్కడ ఉన్నట్లుగా శివాజీ చెబుతున్నాడు. మొత్తానికి అయితే ఈ వారం నామినేషన్స్‌లో గట్టిగానే వాదనలు జరిగాయి.
- Read latest TV News and Movie Updates