సూపర్ స్టార్ మహేశ్ బాబు తనయ తెలియని వారు ఉండరు. తను ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో ఫేమస్. తన డ్యాన్స్ మూవ్స్‌తో ఆకట్టుకుంటుంది. లేటెస్ట్ ఫొటోస్‌తో పాటు రీల్స్ షేర్ చేస్తూ ట్రెండ్ ఫాలో అవుతుంది. తాజాగా ఓ ఫేమస్ జ్యూయలరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైందట ఈ స్టార్ కిడ్. ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.
May 26, 2023 | 3:56 PM
ఇంకా సినిమాల్లోకి రాలేదు. అయినా సితార పాపకు ఇన్ స్టాలో 1.2 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అంతేకాదు ఆమెకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఏర్పరుచుకుంది. యూట్యూబ్‌లోనూ పలు వీడియోలు షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది.
అయితే సితార పాప ఇప్పుడు ఓ ఫేమస్ ప్రీమియం జ్యువెలరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా సైన్ చేయడం టాక్ ఆఫ్ టాలీవుడ్‌గా మారింది. అతి పెద్ద యాడ్ కాంట్రాక్ట్‌కు సైన్ చేసి.. ఇలాంటి అరుదైన రేర్ ఫీట్ అందుకున్న ఫస్ట్ ఇండియన్ స్టార్ కిడ్‌గా నిలిచింది. కాగా గతంలో కూడా యానిమేషన్ త్రీడీ వెబ్ సిరీస్ ఫంటాస్టిక్ తారకు బ్రాండ్ అంబాసిడర్‌గా చేసింది.
ఇందుకోసం.. సదురు సంస్థ నుంచి సితార భారీగా పారితోషకం అందుకున్నట్లు టాక్ నడుస్తుంది. అయితే ఎంత అన్న విషయంపై క్లారిటీ అయితే రాలేదు. ఇందుకోసం 3 రోజుల పాటు యాడ్ ఫిల్మ్ షూట్‌లో కూడా సితార పాల్గొన్నట్లు తెలిసింది.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ల గారాలపట్టి సితార తన అన్నయ్య గౌతమ్‌ను ఆటపట్టిచడం తనకు ఇష్టమని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
డ్యాన్స్‌లో ఎంతో ప్రావీణ్యం సంపాదించిన సితార.. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుందా..? ఇస్తే నటిగానా..? నిర్మాతగానా లేదా మరోదైనా క్రాఫ్ట్‌పై తనకు ఇంట్రస్ట్ ఉన్నదా తెలియాలంటే ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సిందే.