Entertainment

Mrunal Thakur: హైదరాబాద్‌కు మకాం మార్చేసిన సీతారామం బ్యూటీ.. కారణం ఇదేనా.?


Mrunal Thakur

ఒకే ఒక్క సినిమా ఈ అమ్మడిని తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గర చేసింది. మన దగ్గర చేసిన తొలి సినిమాతో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.. అంతే కాదు భారీ క్రేజ్ కూడా సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో జర్సీ సినిమాతో ఆకట్టుకున్న మృణాల్ ఠాకూర్.. తెలుగులో సీతారామం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. హనురాఘవాపుడి దర్శకత్వం వహించిన ఈ అందమైన ప్రేమ కథలో సీతామహాలక్ష్మీ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది మృణాల్. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం మృణాలకు టాలీవుడ్ లో బిగ్ ఆఫర్స్ వస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఈ అమ్మడు ఇప్పుడు హైదరాబాద్ లో ఇల్లు కొనుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగులో వస్తున్న ఆఫర్స్ దృష్టిలో పెట్టుకొని ఈ అమ్మడు ఇక్కడ ఇల్లు కొన్నదట. ఈ వార్తలో వాస్తవమెంత అన్నది తెలియదు కానీ.. ఇప్పుడు ఇదే టాపిక్ ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది.

ఇక మృణాల్ ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని సినిమాలో నటిస్తోంది. నాని కెరీర్ లో 30వ సినిమాగా వస్తోన్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే బుచ్చిబాబు, రామ్ చరణ్ సినిమాలోనూ మృణాల్ ఛాన్స్ దక్కించుకుందని టాక్

Related Articles

Back to top button