Singer Sunitha: గుండె బరువయిపోయింది అంటున్న సింగర్ సునీత.. మనసు గుబులుగా ఉందంటూ..
ఇప్పటికే డైరెక్టర్ శేఖర్ కమ్ముల స్పందిస్తూ.. రంగమార్తండ సినిమా చూస్తున్నంతసేపు తాను కన్నీళ్లు ఆపుకోలేకపోయానని అన్నారు. ఈ సినిమా చూస్తే తన గుండె బరువయిపోయిందని.. మనసంతా గుబులుగా ఉందని అంటున్నారు సింగర్ సునీత.
చాలా కాలం తర్వాత డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న లేటేస్ట్ చిత్రం రంగమార్తండ. బ్రహ్మనందం, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధమయ్యింది. అన్ని కార్యక్రమాలు పూర్తైన ఈ మూవీ ఉగాది కానుకగా ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా గురువారం ఈ మూవీ స్పెషల్ షో వేశారు. సినీ ప్రముఖులు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఈ చిత్రాన్ని వీక్షించి డైరెక్టర్ కృష్ణవంశీపై మరోసారి ప్రశంసలు కురిపించారు. ఇప్పటికే డైరెక్టర్ శేఖర్ కమ్ముల స్పందిస్తూ.. రంగమార్తండ సినిమా చూస్తున్నంతసేపు తాను కన్నీళ్లు ఆపుకోలేకపోయానని అన్నారు. ఈ సినిమా చూస్తే తన గుండె బరువయిపోయిందని.. మనసంతా గుబులుగా ఉందని అంటున్నారు సింగర్ సునీత.
తాజాగా రంగమార్తండ స్పెషల్ షో చూసిన సింగర్ సునీత ఈ చిత్రంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. “ఒక సినిమాలో ఒక మూడు క్యారెక్టర్స్.. ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మనందం వారి పెర్ఫ్మెన్స్ తో గుండె అంత బరువైపోయింది. మనసంత గుబులుగా అనిపిస్తుంది. ఇటువంటి రెగ్యులర్ గా ఉంటే బయటపడేందుకు రకరకాల మార్గాలు వెతుకుతుంటాం.
కానీ నాకు మాత్రం ఆ బరువు చాలా బాగుంది. మనసు గుబులుగా ఉన్నా అందులో ఉండిపోవాలనిపిస్తోంది. అలాంటి గొప్ప పెర్ఫామెన్స్ నటీనటుల నుంచి తీసుకురావడం డైరెక్టర్ కృష్ణవంశీ గారికే సాధ్యమం. ఈ సినిమా మీ హృదయాన్ని కదిలించే సన్నివేశాలు చాలా ఉన్నాయి ” అంటూ చెప్పుకొచ్చారు సునీత.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి