Entertainment

Chinmayi Sripaada: కమల్ ట్వీట్‌కు కౌంటర్ ఇచ్చిన సింగర్ చిన్మయి.. ఎలా నమ్మాలి అంటూ..


లోకనాయకుడు కమల్ హాసన్ కూడా రెజ్లర్లకు మద్దతుగా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశారు. కమల్ ట్వీట్ పై ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద కౌంటర్ ఇచ్చారు.

బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌‌పై.. రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దేనికి పై రెజ్లర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సినిమా తారలు, ప్రముఖులు రెజ్లర్లకు మద్దతుగా తెలుస్తున్నారు. తాజాగా లోకనాయకుడు కమల్ హాసన్ కూడా రెజ్లర్లకు మద్దతుగా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశారు. కమల్ ట్వీట్ పై ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద కౌంటర్ ఇచ్చారు. కమల్ ట్వీట్‌కు చిన్మయి కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. రెజ్లర్లు ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. రెజ్లర్ల నిరసన మొదలై నెల రోజులు అవుతుంది. నేషనల్ గ్లోరీ కోసం పోటీపడాల్సిన వారిని ఇలా తమ భద్రత కోసం పోరాడే స్థితికి తీసుకొచ్చాం. తోటి భారతీయులారా.. మన అటెన్షన్ కు అర్హులు ఎవరు..? మన జాతీయ క్రీడా చిహ్నాల్లా.. లేదా నేర చరిత్ర కలిగిన రాజకీయ నాయకులా.. అని ట్వీట్ చేశారు. దీని పై చిన్మయి రియాక్ట్ అయ్యారు.

‘మహిళలపై వేధింపులకు పాల్పడిన వ్యక్తిని ప్రశ్నించినందుకు తమిళనాడులోని ఒక సింగర్‌ పై 5 సంవత్సరాలు నిషేధించబడింది. ఇది వారి కళ్ల ముందు జరిగినా.. ఆ రచయిత పట్ల వారికి గౌరవం ఉంది కాబట్టి దాని గురించి ఇంత వరకు మాట్లాడలేదు. ఇలా తమ చుట్టూ జరిగిన వేధింపులను పట్టించుకోకుండా ఇప్పుడు మహిళల భద్రత గురించి మాట్లాడే రాజకీయ నాయకులను ఎలా నమ్మాలి.? అంటూ ట్వీట్ చేసింది.

అలాగే ఈ ట్వీట్ వల్ల ఇప్పుడు ఎన్ని అభ్యంతరకర కామెంట్లు వస్తాయో చూడాలి అంటూ ట్వీట్ చేసింది. గతంలో చిన్మయి రైటర్ వైరముత్తు పై లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. చిన్మయికి మద్దతుగా ఆసమయంలో ఎవ్వరూ నిలవలేదు. వైరముత్తు పై ఆరోపణలు చేసినందుకు చిన్మయి పై 5 ఏళ్లు నిషేధం విధించారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Related Articles

Back to top button