News

silver prices, Gold Price Today: మరింత పడిపోయిన బంగారం ధర.. మంచి ఛాన్స్.. తులం రేటు ఎంతంటే? – gold rate today dips rs 150 per 10 grams in hyderabad silver price in delhi


Gold Price Today: భారత ప్రజల జీవితాల్లో బంగారానికి అత్యున్నత స్థానం ఉంటుంది. ఎంతో కొంత తమ వద్ద బంగారం ఉండాలని కోరుకుంటారు. ఒకప్పుడు అలంకారానికి మాత్రమే వినియోగించి పసిడి ప్రస్తుతం ఒక పెట్టుబడి సాధనంగానూ మారిపోయింది. దీంతో బంగారం కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో డిమాండ్ పెరిగి బంగారం ధరలు కొన్నేళ్లలోనే పలు రేట్లు పెరిగిన విషయం తెలిసిందే. సరికొత్త గరిష్ఠాలను నమోదు చేసింది. దీంతో చాలా మంది బంగారం కొనేందుకు వెనకడుగు వేస్తున్నారు. అలాంటి వారికి ఇది మంచి శుభవార్తగా చెప్పవచ్చు. కొద్ది రోజులుగా దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు వరుసగా పడిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ ధరలు పడిపోతుండడం ఇందుకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో హైదరాబాద్, ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో బంగారం రేట్లు ఇవాళ ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.అంతర్జాతీయ మార్కెట్లో చూసుకుంటే క్రితం సెషన్‌లో బంగారం ధర భారీగా దిగివచ్చింది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుతో డాలర్ పుంజుకోవడం, బాండ్ ఈల్డ్స్‌కి గిరాకీ పెరగడంతో పాటు అగ్రరాజ్య జీడీపీ మెరుగైన గణాకాలు నమోదు చేయడంతో బంగారం రేటు పడిపోతోంది. ఇవాళ స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1946.55 డాలర్లు వద్దకు దిగివచ్చింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 23.33 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. భారత కరెన్సీ రూపాయి విలువ గ్లోబల్ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే కాస్త పుంజుకుని రూ.82.623 మార్క్ వద్ద అమ్ముడవుతోంది.

హైదరాబాద్‌లో ఇవాళ 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.150 మేర పడిపోయింది. వరుసగా రెండు రోజుల్లో రూ.600 దిగివచ్చింది. ప్రస్తుతం తులం రేటు రూ.55 వేల 650 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర తులానికి రూ.160 తగ్గి రూ.60 వేల 710 వద్ద కొనసాగుతోంది. మరోవైపు.. ఢిల్లీలో ఇవాళ 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.150 తగ్గి రూ.55 వేల 800 పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు తులానికి రూ.160 పడిపోయి రూ.60 వేల 860 మార్క్ వద్ద కొనసాగుతోంది.

వెండి విషయానికి వస్తే వరుసగా పడిపోతోంది. గత ఐదు రోజుల్లోనే ఏకంగా కిలోపై రూ.2800 దిగివచ్చింది. ఇవాళ కిలో వెండి రేటు హైదరాబాద్ మార్కెట్లో రూ. 300 తగ్గి ప్రస్తుతం రూ.76 వేల 200 మార్క్ వద్ద కొనసాగుతోంది. ఇక
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రేటు రూ.150 తగ్గి ప్రస్తుతం రూ.72 వేల 900 ట్రేడింగ్ అవుతోంది. ఢిల్లీతో పోల్చినప్పుడు మన హైదరాబాద్‌లో బంగారం రేటు కాస్త తక్కువగా ఉండడం, వెండి రేటు కాస్త ఎక్కువగా ఉండడం గమనించవచ్చు. అందుకు స్థానికంగా ఉండే ట్యాక్సులు కారణంగా చెబుతారు.

  • Read Latest Business News and Telugu News

Gold Prices: గుడ్‌న్యూస్.. వరుసగా పడిపోతున్న బంగారం ధర.. ఇవాళ్టి రేట్లు ఇవే.. తులం ఎంతంటే?Gold Rate Today: గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం గోల్డ్ ఎంతంటే?

Related Articles

Back to top button