News

Siddipet Road Accident,Siddipet: పరీక్ష రాసి వస్తుండగా ఘోర ప్రమాదం.. ముగ్గురు విద్యార్థులు స్పాట్ డెడ్, 8 మంది సీరియస్ – 3 students spot dead and 8 were serious in siddipet road accident


సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిన్న కోడూరు మండలం అనంత సాగర్ శివారులో రాజీవ్ రహదారిపై అగి ఉన్న ఇసుక లారీని వెనుక నుంచి అతివేగంతో దూసుకొచ్చిన ఓ క్వాలిస్ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో.. క్వాలిస్‌లోని ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. కాగా.. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం సమయంలో క్వాలిస్‌లో మొత్తం 11 మంది విద్యార్థులున్నట్లు తెలుస్తోంది.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే.. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో క్షతగాత్రులను వాహనం నుంచి బయటకు తీసి.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.అయితే.. ఈ విద్యార్థులంతా సిద్దిపేటలోని ఇందూర్ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నట్టు తెలుస్తోంది. కరీంగనర్‌లోని తిమ్మాపూర్‌లో పరీక్షకు హాజరై.. తిరిగి సిద్దిపేటకు వస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారం.

మృతి చెందిన విద్యార్థులు.. నితిన్, గ్రీష్మ, నమ్రతగా పోలీసులు గుర్తించారు. అయితే.. చికిత్స పొందుతున్న మిగతా ఎనిమిది మంది విద్యార్థుల పరిస్థితి సీరియస్‌గానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నాలో ఒక భాగం అక్కడే వదిలేసినట్టు అనిపిస్తోంది.. భువనేశ్వరి భావోద్వేగం

Related Articles

Back to top button