News

Siddipet Man Climbs To Hoarding, సిద్ధిపేట: మెడకు తాడు బిగించుకుని హోర్డింగ్ ఎక్కాడు.. జస్ట్ మిస్, పోలీసుల రాకతో సేఫ్ – a man try to attempt to hang himself to a hoarding with a rope in siddipet


ఓ వ్యక్తి మద్యం మత్తులో రెచ్చిపోయాడు. మెడకు తాడు బిగించుకుని రోడ్డు పక్కన ఉన్న హోర్డింగ్‌కు వేలాడుతూ కనిపించాడు. ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకుని అతడ్ని కాపాడారు. సిద్దిపేట ముస్తాబాద్‌ చౌరస్తాలో ఓ వ్యక్తి బుధవారం సాయంత్రం డివైడర్ పక్కనున్న హోర్డింగ్‌పైకి ఎక్కాడు. అతడు మెడకు తాడు కట్టుకున్నాడు. తన చేతులుతో హోర్డింగ్‌ను పట్టుకుని వెలాడుతూ కనిపించాడు. అతడ్ని చూసి స్థానికులు కంగారుపడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు.

అతడ్ని కాపాడేందుకు రోడ్డుపై వెళుతున్న ఓ స్కూల్ బస్సును నిలిపారు. ఆ వ్యక్తి మెడకు తాడుతోనే అతడు బస్సు పైకి దూకాడు.. ఆ వాహనం సరైన ఎత్తులో ఉండటంతో అతడి మెడకు తాడు బిగుసుకోలేదు. అతడు సురక్షితంగా బయటపడ్డాడు. హోర్డింగ్‌పైకి ఎక్కిన వ్యక్తిని సిద్దిపేట అర్బన్‌ మండలం చిన్నగుండవెల్లికి చెందిన కొమురయ్యగా గుర్తించారు. అతడు అతడు మద్యం మత్తులో ఉన్నారని.. గత నెల 31న ఇదే తరహాలో అతను ఆత్మహత్యాయత్నం చేశారని పోలీసులు చెబుతున్నారు.

కొమురయ్య డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొంతకాలంగా కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై మద్యానికి బానిసయ్యాడు. ఆ మత్తులోనే ఇలా చేశాడని చెబుతున్నారు. కొమురయ్యకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి అతడ్ని పంపించేశారు.

  • Read More Telangana News And Telugu News

Related Articles

Back to top button