Siddarth: ప్రేమకథను యాక్షన్తో మెప్పిస్తానంటున్న హీరో సిద్ధార్థ్.. ‘టక్కర్’ రిలీజ్ ఎప్పుడంటే..
సాధారణంగా సిద్ధార్థ్ సినిమాలలో ప్రేమ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ఈ సినిమాలో ప్రేమ సన్నివేశాలతో పాటు ఉత్కంఠను రేపేలా అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండనున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘టక్కర్’ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న చార్మింగ్ హీరో సిద్ధార్థ్ త్వరలో ‘టక్కర్’ సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది.
సాధారణంగా సిద్ధార్థ్ సినిమాలలో ప్రేమ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ఈ సినిమాలో ప్రేమ సన్నివేశాలతో పాటు ఉత్కంఠను రేపేలా అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండనున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘టక్కర్’ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రొమాన్స్, యాక్షన్ మేళవింపుతో రూపొందిన ఈ టీజర్ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించింది. ఇక టీజర్ లో సిద్ధార్థ్ సరికొత్త మేకోవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన ‘కయ్యాలే’, ‘పెదవులు వీడి మౌనం’ పాటలు కూడా విశేష ఆదరణ పొందాయి. కథానాయిక స్వభావాన్ని తెలియజేసేలా, ప్రకృతి అందాల నడుమ చిత్రీకరించిన ‘కయ్యాలే’ పాట కట్టిపడేసింది. నాయకానాయికల ఘాటు ప్రేమను తెలిపేలా సాగిన ‘పెదవులు వీడి మౌనం’ పాట మనసు దోచేసింది. ఇలా పాటలు, ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి రోజురోజుకి పెరుగుతోంది. ఈ చిత్రంతో సిద్ధార్థ్ మరో భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమనే అంచనాలున్నాయి.
ఈ రొమాంటిక్ యాక్షన్ రైడ్ ప్రేక్షకులను ఆకట్టుకొని ఘన విజయం సాధించి, సిద్ధార్థ్ కెరీర్ లో మరో గుర్తుండిపోయే సినిమా అవుతుందని చిత్ర బృందం ఎంతో నమ్మకంగా ఉంది. ఈ సినిమాలో అభిమన్యు సింగ్, యోగి బాబు, మునీశ్ కాంత్, ఆర్జే విజ్ఞేశ్ కాంత్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నివాస్ కె. ప్రసన్న సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వాంచినాథన్ మురుగేశన్, ఆర్ట్ డైరెక్టర్ గా ఉదయ కుమార్ కె, ఎడిటర్ గా జీఏ గౌతమ్ వ్యవహరిస్తున్నారు.
#Takkar releasing in theatres worldwide on JUNE 9th.
Get to witness the world of modern Love & more about life !!
AdvertisementStarring #Siddharth
Directed by @Karthik_G_Krish#TakkarFromJune9@AAArtsOfficial @vishwaprasadtg@AbhishekOfficl @itsdivyanshak@vivekkuchibotla @MayankOfficl… pic.twitter.com/VakDTWEHSc— People Media Factory (@peoplemediafcy) May 19, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి