News
shushila devi, Commonwealth Games లో సుశీల దేవికి సిల్వర్ మెడల్.. ఏడుకి చేరిన భారత్ పతకాలు – shushila devi wins her 2nd silver at commonwealth games
2014 కామన్వెల్త్ గేమ్స్‌లోనూ రజత పతకం గెలుపొందిన సుశీల దేవి.. ఈరోజు ఫైనల్లో దక్షిణాఫ్రికాకి చెందిన మైకేల వైట్బూయితో గుడ్ టెక్నికల్ ఫైట్ చేసింది. నాలుగు నిమిషాలు ముగిసే సమయానికి స్కోరు 0-0గా ఉండటంతో బౌల్ట్.. గోల్డెన్ పాయింట్‌కి దారి తీసింది. అయినా.. సుశీల దేవికి నిరాశ తప్పలేదు. దాంతో.. స్వర్ణం గెలుస్తుందని ఆశించిన ఈ మణిపూర్ జూడోక రజతంతో సరిపెట్టుకుంది.
కామన్వెల్త్ గేమ్స్ 2014లో రజతం, 2015 జూనియర్ ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకం గెలుపొందిన సుశీల దేవి.. పటియాలాలో కఠిన శిక్షణ తీసుకుంది. మణిపూర్‌లో సబ్- ఇన్స్పెక్టర్గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తోంది.