News
Shubman Gill Century: 4 మ్యాచ్‌ల్లో మూడో సెంచరీ.. ముంబై బౌలర్లను చితక్కొట్టిన గిల్.. తుఫాన్ ఇన్నింగ్స్.. – Telugu News | Shubman gill 3rd century ipl 2023 season century against mumbai indian gt vs mi qualifier 2
GT vs MI, Qualifier 2: ఈ సీజన్‌కు ముందు శుభమాన్ గిల్ ఒక్క సెంచరీ కూడా చేయలేదు. కానీ, ఈసారి అతను కేవలం 4 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు కొట్టాడు.

Shubman Gill Century
ఈ ఏడాది ఐపీఎల్ 2023 సీజన్‌లో శుభ్‌మన్ గిల్ బ్యాట్‌తో పరుగులు రాబడుతూనే ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్ యువ ఓపెనర్ ముంబై ఇండియన్స్‌పై క్వాలిఫయర్-2లోనూ తన అద్భుతమైన ఫాంతో మరోసారి తుఫాన్ సెంచరీ చేశాడు. ఈ సీజన్‌లో గిల్‌కి ఇది మూడో సెంచరీ. ఈ ఇన్నింగ్స్‌లో అతని అద్భుతమైన బ్యాటింగ్ సహకారం ఎంత ఉందో, క్యాచ్‌లను వదిలేయడంలోనూ ముంబై ఫీల్డింగ్‌కు అంతగానే నిలిచింది.
Advertisement
గిల్ తుఫాన్ ఇన్నింగ్స్ తో ఈ సీజన్‌లో 49 బంతుల్లో మూడో సెంచరీ పూర్తి చేశాడు. ప్లేఆఫ్స్‌లో గిల్ అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు.