News

shubman gill, వావ్ గిల్.. సెంచరీలే కాదు, మరో హ్యాట్రిక్.. ఏ ఇతర ఆటగాడికీ సాధ్యంకాని రీతిలో! – gujarat titans shubman gill set to play his third ipl final in a row


భారత యువ ప్లేయర్, ప్రిన్స్‌గా పేరుపొందిన శుభ్‌మన్ గిల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్-2016లో అదరగొడుతున్నాడు. టీమిండియా తరఫున ఫార్మాట్‌తో సంబంధం లేకుండా రాణిస్తున్న ఈ ప్లేయర్.. ఐపీఎల్‌లోనూ పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ సీజన్‌లో మూడు సార్లు మూడంకెల స్కోరు సాధించాడు. 16 మ్యాచుల్లో 851 పరుగులు సాధించి.. ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్‌లో నిలిచాడు. ఫలింతగా తన టీమ్ (Gujarat Titans)ను వరుసగా రెండో సారి ఫైనల్‌కు చేర్చాడు. ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్ – చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. మే 28 ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు ఫైనల్ మ్యాచ్.. గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.

ఈ ఐపీఎల్ సీజన్ శుభ్‌మన్ గిల్ హవా కొనసాగుతోంది. లీగ్ దశలో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేసిన గిల్.. క్వాలిఫయర్-2లో శతక్కొట్టాడు.

2018లో ఐపీఎల్‌లో అడుగు పెట్టిన గిల్.. ఇప్పటివరకు 90 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తంగా 2,751 పరుగులు చేశాడు. ఈ ఏడాది సెంచరీలు, రన్స్‌లోనే కాకుండా మరో మరో విషయంలోనూ శుభ్‌మన్ గిల్ ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. మే 28న అతను ఆడబోయే ఫైనల్ అతడికి మూడోది. వరుసగా 3 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పనున్నాడు.

2021లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున చెన్నై సూపర్ కింగ్స్‌‌తో ఫైనల్ మ్యాచ్ ఆడాడు గిల్. ఆ మ్యాచులో 51 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గతేదాడి గుజరాత్ టైటాన్స్ తరఫున ఫైనల్స్‌లో 45 పరుగులు చేశాడు. ఈ ఏడాది ఆడనున్న ఫైనల్ గిల్‌కు మూడోది. దీని ద్వారా ఐపీఎల్ ఫైనల్‌ల హ్యాట్రిక్‌ను గిల్ నమోదు చేయనున్నాడు.

ఫార్మాట్‌కు సంబంధం లేకుండా బ్యాట్‌తో చెలరేగి పోతున్న గిల్.. ఫైనల్‌లోనూ రెచ్చిపోతాడా అనేది తేలాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.

Related Articles

Back to top button