Entertainment

Shruti Haasan: అటు బాలయ్య.. ఇటు బాస్.. ఇద్దరు హీరోల ముద్దుల హీరోయిన్‌గా శ్రుతిహాసన్


ప్రమోషన్లకు ప్లాన్‌ చేసుకుంటున్నారు. పండక్కి సినిమా రిలీజ్‌ అయితే ఆ ఆనందం ఇంకో రేంజ్‌లో ఉంటుంది. ఒక సినిమా రిలీజ్‌కే సంబరాలు చేసుకుంటే, రెండు సినిమాలు క్యూలో ఉంటే ఏం చేయాలి? అందులోనూ ఆ రెండూ టాలీవుడ్‌ టాప్‌ హీరోల సినిమాలైతే సందడి ఇంకే స్థాయిలో ఉండాలి.

పండగంటేనే చుట్టూ సేల్స్, ఒన్‌ ప్లస్‌ ఒన్‌ ఆఫర్స్. ఇప్పటిదాకా అలాంటి వాటినే చూసిన శ్రుతి.. ఇప్పుడు కొత్తగా ఒన్‌ ఈక్వల్‌టు ఒన్‌ అంటూ రెండు సినిమాలకు సంబంధించి నయా ఈక్వేషన్లు నేర్చుకుంటున్నారు. ప్రమోషన్లకు ప్లాన్‌ చేసుకుంటున్నారు. పండక్కి సినిమా రిలీజ్‌ అయితే ఆ ఆనందం ఇంకో రేంజ్‌లో ఉంటుంది. ఒక సినిమా రిలీజ్‌కే సంబరాలు చేసుకుంటే, రెండు సినిమాలు క్యూలో ఉంటే ఏం చేయాలి? అందులోనూ ఆ రెండూ టాలీవుడ్‌ టాప్‌ హీరోల సినిమాలైతే సందడి ఇంకే స్థాయిలో ఉండాలి. ఊహ కూడా వేరే లెవల్లో ఉందంటారా? ఇప్పుడు ఆ ఊహను నిజం చేసుకుంటున్నారు శ్రుతిహాసన్‌. అటు మెగా బాస్‌, ఇటు నందమూరి అందగాడితో ముగ్గుల పండక్కి థియేటర్లలోకి వచ్చేస్తున్నారు శ్రుతి. వాల్తేరు వీరయ్య టీజర్‌ చూశారా? మెగాఫ్యాన్స్ కోరుకునే అసలైన మసాలా సినిమా ఇదే అనిపించిందా? యస్‌. పేరులోనే కాదు, మెగాస్టార్‌ లుక్‌లోనూ, గెటప్పులోనూ సేమ్‌ టు సేమ్‌ మాస్‌ ఎలివేషన్‌ని ప్లాన్‌ చేస్తున్నారు డైరక్టర్‌ బాబీ.

వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్‌ పక్కన హీరోయిన్‌గా నటిస్తున్నారు శ్రుతిహాసన్‌. డైరక్టర్‌ బాబీతో ఇంతకు ముందే పరిచయం ఉంది శ్రుతిహాసన్‌కి. ఆమె నటించిన ఓ మై ఫ్రెండ్‌ సినిమాకు స్క్రీన్‌ప్లే చేశారు బాబీ. బలుపు సినిమాకు కథ కూడా బాబీదే. ఆ పరిచయంతోనే వాల్తేరు వీరయ్య కథ చెప్పారట డైరక్టర్‌. కథ నచ్చడం, చిరు సినిమా కావడంతో వెంటనే ఓకే చెప్పేశారు శ్రుతి. వాల్తేరు వీరయ్య సినిమా దర్శకుడు బాబీతోనే కాదు, వీరసింహారెడ్డి దర్శకుడు గోపీచంద్‌ మలినేనితో కూడా ఆల్రెడీ పరిచయం ఉంది శ్రుతి హాసన్‌కి. గోపీచంద్‌ డైరక్ట్ చేసిన బలుపు సినిమాలో శ్రుతి నాయికగా నటించారు. రీసెంట్‌ టైమ్స్ లో మాస్‌ కల్యాణిగా శ్రుతి మెప్పించిన క్రాక్‌ సినిమాకు కూడా గోపీచందే డైరక్టర్‌.

గోపీచంద్‌ డైరక్షన్‌లో శ్రుతి చేస్తున్న హ్యాట్రిక్‌ సినిమా వీరసింహారెడ్డి. ఆల్రెడీ విడుదలైన నందమూరి బాలకృష్ణ టైటిల్‌ పోస్టర్‌కి చాలా మంచి స్పందన వస్తోంది. బాలయ్య పక్కన హీరోయిన్‌ అంటే, అదే రేంజ్‌లో కేరక్టర్‌ని డిజైన్‌ చేసి ఉంటారు గోపీచంద్‌. తన పొటెన్షియల్‌ తెలిసిన డైరక్టర్‌ కాబట్టి, సినిమా గురించి చెప్పగానే ఓకే చేసేశారట శ్రుతి. బాలయ్య పక్కన శ్రుతి చేస్తున్న కేరక్టర్‌ని చూడటానికి అటు నందమూరి సైన్యం కూడా వెయిటింగ్‌.

సంక్రాంతికి శ్రుతిహాసన్‌ నటించిన రెండు సినిమాలు బ్యాక్‌ టు బ్యాక్‌ రిలీజ్‌ కావడం, అందులోనూ అవి చిరంజీవి, బాలకృష్ణతో చేసినవి కావడంతో ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తున్నారు ఆడియన్స్. 2001 సంక్రాంతికి చిరంజీవితో మృగరాజు, బాలకృష్ణతో నరసింహనాయుడు సినిమాలతో థియేటర్లలో సందడి చేసిన సిమ్రన్‌ని గుర్తు చేసుకుంటున్నారు జనాలు. ఈ సారి శ్రుతి జతగా బంపర్‌ హిట్‌ కొట్టబోయేది మెగాస్టారా? నందమూరి స్టారా? అనే డిస్కషన్లు కూడా రంజుగా జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

Advertisement



లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button