Shrihan Son, Siri Shrihan: శ్రీహాన్ కోసం సిరి పచ్చబొట్టు.. వీళ్ల కొడుకు మామూలోడు కాదు.. జూ.కమల్ హాసన్‌లా చెలరేగాడు – siri hanmanth tattoo suprise for shrihan
ఆ తరవాత శ్రీహాన్‌ని లోపలికి తీసుకుని వెళ్లిన సిరి.. ప్రియుడి పేరుని తన వీపుపై పచ్చబొట్టు పొడిపించుకున్నదాన్ని చూపించి సర్ ప్రైజ్ చేసింది. ఇంతలో శ్రీహాన్-సిరిల కొడుకు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి చిచ్చరపిడుగులా చెలరేగాడు. హౌస్‌లో ఒక్కో కంటెస్టెంట్స్ ఎలా ప్రవర్తిస్తారో.. ఎలా మాట్లాడతారో చెప్పి ఆకట్టుకున్నాడు. రేవంత్.. ‘నా క్యారెక్టర్ ఇంతే నేను ఇలాగే ఉంటా’ అని అంటాడని.. ఆదిరెడ్డి.. ‘కవితా ఐ లవ్యూ’ అంటాడని.. చెప్పిన చైతూ.. నామినేషన్స్‌లో తన తండ్రి ఇనయతో గొడవపడినప్పుడు ఎలా అన్నాడో సేమ్ అలా దింపేశాడు.
‘వాడు వీడు ఏంటి? రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు’ అంటూ శ్రీహాన్.. ఇనయపై సీరియస్ అయిన సీన్‌ని చేసి చూపించాడు బుడతడు. మొత్తానికి శ్రీహాన్-సిరి జోడీ చాలా క్యూట్‌గా అనిపించింది. ఆ పిల్లోడు అయితే అదరగొట్టేశాడు. అయితే సిరి.. బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చి శ్రీహాన్‌తో ఏం మాట్లాడింది. ఏం చెప్పింది.. ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో ఈ కింది లింక్‌లో చూడొచ్చు.
Read Also: శ్రీహాన్, సిరి ముద్దుల జాతర.. విన్నర్ ఎవరో ప్రియుడికి హింట్..రొమాంటిక్ సినిమా చూపించేశారయ్యో
Read more Cinema News and Telugu News, TV News