shreyas iyer bowling, Rohit Sharma | కెప్టెన్ రోహిత్ శర్మ కొత్త ఎత్తుగడ.. మ్యాచ్‌లో సడన్‌గా నాలుగో స్పిన్నర్‌ని తెరపైకి! – shreyas iyer bowls for the first time in tests
వాస్తవానికి ఈరోజు తొలి సెషన్‌లోనే భారత్ బౌలర్లు.. ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ (32: 44 బంతుల్లో 7×4), మార్కస్ లబుషేన్ (3: 20 బంతుల్లో) వికెట్లు పడగొట్టారు. కానీ.. ఆ తర్వాత క్రీజులో పాతుకుపోయిన ఖవాజా, స్టీవ్‌స్మిత్ జోడీ.. దాదాపు 40 ఓవర్లుగా భారత్‌కి మరో వికెట్ ఇవ్వడం లేదు. రెండో వికెట్ చేజారిన తర్వాత 9 ఓవర్లలో కేవలం 3 పరుగులే ఈ జోడి చేసిందంటే? ఎంత అతి జాగ్రత్తగా బ్యాటింగ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. రెండో సెషన్ పూర్తిగా ఈ జంటని భారత్ బౌలర్లు విడదీయలేకపోయారు.
ఉస్మాన్ ఖవాజా, స్టీవ్‌స్మిత్ జోడీని విడదీసేందుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ చేయని ప్రయోగం లేదు. టీమ్‌లోని ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్‌తో పాటు స్పిన్నర్లు అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్‌తో మార్చి మార్చి బౌలింగ్ చేయించాడు. కానీ.. ఎవరూ వికెట్ తీయలేకపోయారు. దాంతో నాలుగో స్పిన్నర్ రూపంలో శ్రేయాస్ అయ్యర్‌ని కెప్టెన్ రోహిత్ శర్మ తెరపైకి తీసుకొచ్చాడు. టీ బ్రేక్ ముంగిట ప్రయోగాత్మకంగా శ్రేయాస్ అయ్యర్‌తో ఓ ఓవర్‌ని రోహిత్ శర్మ వేయించాడు. కానీ.. ప్రాక్టీస్ లేకపోవడంతో ఫస్ట్ బాల్‌నే ఫుల్ టాస్ రూపంలో విసిరిన శ్రేయాస్ అయ్యర్.. ఆ ఓవర్‌లో మొత్తం 2 పరుగులు ఇచ్చాడు. కానీ అతను కూడా వికెట్ తీయలేకపోయాడు. 2021 నుంచి టెస్టుల్లో ఆడుతున్న శ్రేయాస్ అయ్యర్ ఈ ఫార్మాట్‌లో బౌలింగ్ చేయడం ఇదే తొలిసారి. టీ20, వన్డేల్లో మాత్రం మొత్తంగా ఓ 6-7 ఓవర్లు బౌలింగ్ చేశాడు.
Read Latest Sports News, Cricket News, Telugu News