News

Shocking: ఏందిరయ్యా.. కొంచెమైనా చూసుకోబళ్లా.. హీరోలా ఫీలై పాడుపని చేయబోయాడు.. అడ్డంగా బుక్కయ్యాడు..!


Arrest

తమిళ స్టార్ హీరో అజిత్ సినిమా చూశాడు.. అందులో బ్యాంక్ చోరీ సీన్‌ను చూసి బాగా టెంప్ట్ అయ్యాడు.. ఇంకేముంది తాను కూడా అలాగే చేయాలనుకున్నాడు. కానీ, రీల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు అని వాడు గుర్తించలేకపోయాడు. కట్ చేస్తే కటకటాల్లో ఊచలు లెక్కిస్తున్నాడు. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

తమిళనాడులోని దిండిక్కల్ కి చెందిన రగుమాన్. అజిత్ నటించిన తెగింపు సినిమా చూసి అదే సినిమా స్టైల్ లో బ్యాంకు లో రాబరీ చేసి డబ్బుతో పారిపోదామనుకొని పక్క గా స్కెచ్ వేసి పట్టపగలు ప్రైవేట్ బ్యాంకు లోకి ప్రవేశించాడు. తన దగ్గర ఉన్న పెప్పర్ స్ప్రే ప్రయోగించి కత్తితో బెదిరించి నగదు ని బ్యాగ్ లో వేయమని క్యాషియర్ ని బెదిరించాడు. అది చూసి భయంతో పరుగులు పెట్టిన జనం.. బయటికి వచ్చి అరిచారు. దాంతో అలర్ట్ అయిన మిగతా ప్రజలు బ్యాంకులోకి వచ్చి రగుమాన్ ని చితకబాదారు. అనంతరం పోలీసులకి అప్పగించారు. పోలీస్ విచారణలో తన అప్పులు తీర్చాలంటే డబ్బు అవసరం ఉందని, ఎలా అప్పు తీర్చాలో తేలిక అజిత్ నటించిన తెగింపు సినిమా చూసి అందులో ఉన్నట్టుగా డబ్బుకోసం బ్యాంకు రాబరీకి పాల్పడ్డానని వెల్లడించాడు. అయితే, ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Related Articles

Back to top button