shinde disqualification plea, అనర్హత పిటిషన్‌పై షిండే వర్గం యూటర్న్.. జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు – supreme court fires on eknath shinde camp for its u turn on disqualification plea
‘‘దాదాపు శివసేనకు చెందిన అందరి ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్‌లను స్పీకర్ నిర్ణయించాలి.. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు మొదటి వేదికగా ఉండకూడదు’’ అని వాదించారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న ధర్మాసనం అనర్హత అంశంపై మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ సుప్రీం కోర్టు కాదని సాల్వేకు కౌంటర్ ఇచ్చింది.
‘‘మీరు (రెబల్స్) ముందుగా కోర్టుకు వచ్చారు.. రక్షణ పొందారు.. ఆ పిటిషన్‌ను స్వీకరించడం కర్ణాకట కేసులో సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా మేం తీర్పునిచ్చాం.. అటువంటి సమస్యలను స్పీకర్ నిర్ణయించాలి.. ఇప్పుడు మీరు మెజారిటీ సాధించి, మీ ఎమ్మెల్యేను స్పీకర్‌గా ఎన్నుకున్నందున, సమస్యను స్పీకర్ పరిష్కరించాలని మీరు కోరుకుంటున్నారు’’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది.
అంతకు ముందు ఉద్ధవ్ ఠాక్రే వర్గం తరఫున వాదనలు వినిపించిన కపిల్ సిబల్.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 10 ప్రకారం, షిండే వర్గం ఎమ్మెల్యేలు తమపై అనర్హత వేటు పడకుండా ఉండాలని భావిస్తే.. వారికున్న ఏకైక మార్గం కొత్తపార్టీ పెట్టుకోవడం లేదా వేరే పార్టీలో కలిసిపోవడమేనని అన్నారు. దీన్ని హరీశ్ సాల్వే కొట్టిపారేశారు. సొంత పార్టీ విశ్వాసం కోల్పోయిన నాయకుడు సభ్యులను ఎలాగోలా తన చేతుల్లో ఉంచుకొనేందుకు వాడే ఆయుధం.. ఫిరాయింపు నిరోధక చట్టం కాదని పేర్కొన్నారు.