Entertainment

Shehnaaz Gill: సిద్ధార్థ్ శుక్లా మరణంపై స్పందించిన షెహానాజ్.. ట్రోలర్స్‏కు స్ట్రాంగ్ కౌంటరిచ్చిందిగా..


ప్రజలకు మా ఇద్దరి గురించి పూర్తిగా తెలియదు. కాబట్టి వారు మా పనిని ఎలా నిర్ణయిస్తారు. నేను నా పనిని పునఃప్రారంభించాలనుకుంటున్నాను.

షెహానజ్ గిల్ (Shehnaaz Gill) ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. హిందీ బిగ్‏బాస్‏లో కంటెస్టెంట్‎గా ఎంటర్ అయ్యి తన మాటతీరుతో.. చలాకీతనం, అల్లరి చేష్టలతో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ముఖ్యంగా దివంగత నటుడు సిద్ధార్థ్ శుక్లాతో స్నేహంతో మరింత ఫేమస్ అయ్యింది. బిగ్‏బాస్‏ ఇంట్లో ఉన్నప్పుడు వీరిద్దరికి స్నేహానికి ఆడియన్స్ సైతం ఫిదా అయ్యారు. ఆ తర్వాత వీరిద్దరు ప్రేమలో ఉన్నారని .. త్వరలోనే పెళ్లి అనౌన్స్మెట్ రాబోతుందని బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపించింది. అయితే గతేడాది సెప్టెంబర్ 2న గుండెపోటుతో మరణించాడు సిద్ధార్థ్. దీంతో షెహానాజ్ షాక్‏లో ఉండిపోయింది. కొన్ని నెలలు ఆమె మీడియాకు దూరంగా ఉండిపోయింది. అనంతరం ఇటీవలే షెహానాజ్ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుంది. సిద్ధార్థ్ మరణించిన కొన్ని నెలల తర్వాత షెహ్నాజ్ రీఎంట్రీ ఇవ్వడం.. నవ్వుతూ.. సరదాగా కనిపించడంతో సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్‏కు గురయ్యింది. ఇటీవల జరిగిన ఎంగేజ్‌మెంట్ పార్టీలో ఆమె నవ్వుతూ డ్యాన్స్ చేస్తున్న వీడియోస్ నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో ఆమెను ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేశారు నెటిజన్స్.

అంతకుముందు షెహ్నాజ్.. తన స్నేహితుడు సిద్ధార్థ్ కు తు యాహీన్ హై అనే వీడియోతో నివాళులు అర్పించింది. ఈవీడియోకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాను కావాలనే మీడియా ముందు ఎమోషనల్ అవుతుందంటూ ఓ వర్గం వారు దారుణంగా కామెంట్స్ చేశాడు. తాజాగా తనపై వచ్చిన ట్రోల్స్ పై స్పందించింది షెహ్నా్జ్. “ప్రజలకు మా ఇద్దరి గురించి పూర్తిగా తెలియదు. కాబట్టి వారు మా పనిని ఎలా నిర్ణయిస్తారు. నేను నా పనిని పునఃప్రారంభించాలనుకుంటున్నాను. తిరిగి స్క్రీన్ ముందుకు రావాలనుకుంటున్నాను. ఎవరైన మీరు గౌరవించినప్పుడు.. వారి కోసం మీరు ఏం చేయనప్పుడు.. మీ పని ఎలా ప్రారంభిస్తారు. నేను తు యాసీన్ హై వీడియో చేయడం గౌరవంగా ఉంది. మన గురించి తెలియని వాళ్లు ఏదైనా అంటే మనమెందుకు బాధపడాలి. వారికి ఉన్న జ్ఞానం గురించి వాళ్లే తెలుసుకోవాలి”. అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి



మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement



Related Articles

Back to top button