News
shanthi kumari ias, Telangana CS: తెలంగాణ తొలి మహిళా సీఎస్‌గా శాంతి కుమారి – shanthi kumari appointed as new cs of telangana
ఇప్పటి వరకు సీఎస్‌గా ఉన్న సోమేష్ కుమార్ తెలంగాణ క్యాడర్‌ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన సమయంలో సోమేష్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. ఈ విషయంలో కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది.
హైకోర్టు తీర్పు వెలువడిన కొన్ని గంటల్లోనే సోమేష్ కుమార్ తెలంగాణ నుంచి రిలీవ్ కావాలంటూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 12లోగా ఆయన ఏపీ ప్రభుత్వంలో చేరాలని ఆదేశాల్లో పేర్కొంది. దీంతో రేపు ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయనున్నట్లు సోమేష్ కుమార్ ప్రకటించారు.
- Read More Telangana News and Telugu News