Entertainment

Vijay Deverakonda: విజయ్ దేవరకొండకు ఈరోజు చాలా స్పెషల్.. ఐదేళ్ల క్రితం రౌడీ జీవితంలో ఏం జరిగిందంటే..


ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‏గా మారిన విజయ్ జీవితంలో ఈరోజు చాలా స్పెషల్. ఎందుకంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరో విజయ్ దేవరకొండకు (Vijay Deverakonda) ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యాన్స్ అంతా రౌడీ అంటూ ముద్దుగా పిలిచుకునే ఈహీరోకు ముఖ్యంగా అమ్మాయిల్లో తెగ ఫాలోయింగ్ ఉంది. విజయ్ యాటిట్యూడ్‏కు యూత్ ఫిదా అయిపోతారు. అయితే చిన్న చిన్న పాత్రలతో.. పలు సినిమాల్లో నటించిన విజయ్.. అర్జున్ రెడ్డి మూవీతో ఒక్కసారిగా స్టార్ అయ్యాడు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అందులో రౌడీ నటనతో ఆడియన్స్‏కు ఆకట్టుకున్నాడు. విజయ్ కెరీర్‏లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలవడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది అర్జున్ రెడ్డి. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‏గా మారిన విజయ్ జీవితంలో ఈరోజు చాలా స్పెషల్. ఎందుకంటే.. తన కెరీర్‏ను మార్చేసిన అర్జున్ రెడ్డి సినిమా విడుదలైంది ఈరోజే (ఆగస్ట్ 25). దాదాపు ఐదేళ్ల క్రితం అంటే 2017 ఆగస్ట్ 25న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్‏ను షేక్ చేసింది. ఈ మూవీలో తన కోపాన్ని.. ప్రేమను కంట్రోల్ చేయ్యలేని ఒక మెడికల్ విద్యార్తి.. ఒక డాక్టర్‏గా.. ప్రియురాలికి దూరమై.. మద్యానికి బానిసైన వ్యక్తిగా విజయ్ నటవిశ్వరూపం చూపించాడనే చెప్పుకోవాలి. తాజాగా ఈ సినిమా విడుదలైన ఐదేళ్లు పూర్తైన సందర్భంగా హీరోయిన్ షాలిని పాండే విజయ్‏కు థాంక్స్ చెబుతూ స్పెషల్ నోట్ షేర్ చేసింది.

ఈరోజుకు నా జీవితంలో అత్యంత ప్రాముఖ్యం ఉంది. దాదాపు ఐదేళ్ల క్రితం నేను ఈరోజున నటిగా వెండితెరకు పరిచయమయ్యాను. అర్జున్ రెడ్డి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో నేను పోషించిన ప్రీతి పాత్రకు ప్రేక్షకుల నుంచి వచ్చిన ప్రేమాభిమానానికి ఎప్పుడు కృతజ్ఞురాలినే. అర్జున్ రెడ్డికి నేనెప్పటికీ రుణపడి ఉంటాను. డైరెక్టర్ సందీప్ రెడ్డికి ధన్యవాదాలు. మొదటి సినిమా ఎలా చేస్తాననే కంగారు పడుతున్న నాకు ధైర్యం చెప్పి.. షూటింగ్ సరదాగా గడిచిపోయేలా చేశాడు. అలాగే నా కోస్టార్ విజయ్ దేవరకొండ. నువ్వు చేసిన ప్రతి పనికి థాంక్యూ. లవ్ యూ. నీ కొత్త సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అంటూ రాసుకొచ్చింది షాలిని.

ప్రస్తుతం విజయ్ మాస్ డైరెక్టర్ పూరి కాంబోలో వచ్చిన లైగర్ చిత్రం థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. ఉదయం నుంచి ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వస్తోంది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. అలాగే రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలకపాత్రలలో నటించారు. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయిన ఈ సినిమా విజయ్ వన్ మ్యాన్ షో… బ్లాక్ బస్టర్ హిట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

ఇవి కూడా చదవండిమరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisement

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండిRelated Articles

Back to top button