Entertainment

Pathaan: బాద్ షా ఆగయా.. షారుఖ్ ఖాన్ పఠాన్ నయా రికార్డ్.. ఏకంగా 100 దేశాలకు పైగా సెన్సెషన్..


సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తుండగా.. జాన్ అబ్రహం జిమ్ కార్టస్ అనే ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. అలాగే అశుతోశ్ రానా, డింపుల్ కపాడియా, గేవీ చాహల్ తదతరులు నటిస్తున్నారు.

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం పఠాన్. దాదాపు నాలుగేళ్ల తర్వాత బాద్ షా స్క్రీన్ పై కనిపించబోతున్నారు. దీంతో ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీలో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండగా.. ఇందులో రా ఏజెంట్ పాత్రలో షారుఖ్ కనిపించనున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తుండగా.. జాన్ అబ్రహం జిమ్ కార్టస్ అనే ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. అలాగే అశుతోశ్ రానా, డింపుల్ కపాడియా, గేవీ చాహల్ తదతరులు నటిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనుండడంతో ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

దాదాపు నాలుగేళ్ల తర్వాత బాద్ షా నుంచి వస్తోన్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలకు ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో పాన్ ఇండియా రేంజ్ లో మూడో స్థానంలో నిలిచింది. దీంతో ఈ మూవీ తొలి రోజున దాదాపు రూ. 50 కోట్లకు పైగానే వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తాజాగా పఠాన్ చిత్రం మరో రికార్డ్ క్రియేట్ చేసేందుకు సిద్ధమైంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని దాదాపు 100 దేశాలకు పైగానే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్సా్. అలాగే ప్రపంచవ్యాప్తంగా 2500కు మించిన స్క్రీన్స్ లో మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఇన్ని దేశాల్లో పెద్ద ఎత్తున ఈ సినిమా విడుదలవుతున్న తొలి భారతీయ సినిమాగా ఈ మూవీ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు.

ఇవి కూడా చదవండి

ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మరింత అంచనాలు పెంచగా.. ఈ మూవీ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను రేపు దేశవ్యాప్తంగా 4000కు పైగా స్క్రీన్లలో రిలీజ్ చేయనున్నారు. హిందీలోనే కాకుండా.. తెలుగు, తమిళం భాషలలోనూ ఈ మూవీ రిలీజ్ కానుంది. చాలా కాలంగా వరుస డిజాస్టర్లతో నెట్టుకొస్తున్న షారుఖ్.. పఠాన్ సినిమాలో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారో చూడాలి.

Advertisement

Related Articles

Back to top button