Shah Rukh Khan ఎక్కడికీ వెళ్లలేదు.. టైమ్ కోసం వెయిట్ చేశాడంతే!: కరణ్ జోహార్ – bollywood filmmaker karan johar says shah rukh khan ‘went nowhere, waited for right time to rule’
బాలీవుడ్ సినిమాలు వరుసగా నిరాశపరుస్తుండటంతో గత ఏడాది చివర్లో కరణ్ జోహార్ (Karan Johar) పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాడు. ప్రేక్షకుల పల్స్‌ని పట్టుకోవడంలో బాలీవుడ్ విఫలమైందని అంగీకరించిన కరణ్ జోహార్.. ప్రాంతీయ సినిమాల్ని చూసి నేర్చుకోవాలని కూడా హితవు పలికాడు. కానీ.. తాజాగా షారూక్ ఖాన్ మూవీ పఠాన్ హిట్‌గా నిలవడంతో.. మళ్లీ తన పాత స్టయిల్లో స్టేట్మెంట్స్ ఇచ్చేశాడు.
పఠాన్ మూవీ చూసిన తర్వాత కరణ్ జోహార్ మాట్లాడుతూ ‘మూవీని బాగా ఎంజాయ్ చేశాను. షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ (గెస్ట్ రోల్) మధ్య వచ్చిన సీన్స్ చూసి థియేటర్లలో నిల్చొని చప్పట్లు కొట్టాను. షారూక్ ఖాన్ ఈ నాలుగేళ్లూ ఎక్కడికీ వెళ్లలేదు. బాక్సాఫీస్‌ని రూల్ చేయడానికి సరైన టైమ్ కోసం వెయిట్ చేశాడంతే. నిజమే.. షారూక్ ఖాన్‌పై ఎన్నో విమర్శలు, బాయ్‌కాట్ వార్నింగ్‌లు వచ్చి ఉండొచ్చు. కానీ కింగ్ వచ్చినప్పుడు ఆ దారిలో ఎవరూ ఉండలేరు’ అని చెప్పుకొచ్చాడు.
పఠాన్ మూవీకి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా.. షారూక్ ఖాన్‌కి జోడీగా దీపికా పదుకొణె నటించింది. అలానే సల్మాన్ గెస్ట్ రోల్, జాన్ అబ్రహాం నెగటివ్ రోల్ పోషించారు. ఆదిత్య చోప్రా ఈ మూవీకి ప్రొడ్యూసర్. షారూక్ ఖాన్ నాలుగేళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లో నటించగా.. చివరిగా అతను నటించిన జీరో మూవీ డిజాస్టర్‌గా మిగిలిన విషయం తెలిసిందే. అలానే పఠాన్ మూవీ రిలీజ్‌కి ముందు ఈ చిత్రాన్ని బాయ్‌కాట్ చేయాలని కొన్ని రాష్ట్రాల్లో పిలుపునిచ్చారు. బుధవారం (జనవరి 25) రిలీజ్ రోజున కూడా ఇండోర్‌లో గొడవలు జరిగాయి. కొన్ని రాష్ట్రాల్లో థియేటర్స్ వద్ద పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.
Read Latest Telugu Movies News , Telugu News