News
seven punjabi people drown, Himachal Pradesh: సరస్సులో స్నానానికి దిగి ఏడుగురు యువకులు మృతి – seven punjabi people drown in himachal pradesh gobind sagar lake
అయితే సరస్సు లోతు ఎక్కువగా ఉండడంతో వారతా మునిగిపోయారు. అందులో నలుగురు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. మిగతావారిని కాపాడేందుకు ప్రయత్నించారు. గాని కోసం గట్టిగా కేకలు వేయగా స్థానికులు వారిని కాపాడేందుకు కృషి చేశారు. కానీ అప్పటికే వారంతా నీటిలో మునిగిపోయారు. దీనికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో యువకుల కోసం గాలించారు. చాలా గంటలు శ్రమించిన తర్వాత చివరకు మృతదేహాలను వెలికి తీశారు.
ఈ ఘటనలో ఏడుగురు యువకులు చనిపోయినట్టు బంగానా ఎస్డీఎం యోగరాజ్ ధీమాన్ పేర్కొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులంతా మగవారేనని, వారిలో ఆరుగురు 16 నుంచి 18 ఏళ్లలోపు వారేనని, ఒకరికి 30 ఏళ్ల వయస్సు ఉంటుందని పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిలో పవన్, రమణ్ కుమార్, లబ్సింగ్, లఖ్వీర్ సింగ్, అరుణ్ కుమార్, విశాల్ కుమార్, శివ ఉన్నారు. వీరంతా బానూద్లో ఉండే వ్యక్తులుగా తెలుస్తుంది.