Entertainment

Sukumar: కాశ్మీర్ ఫైల్స్‌ టీమ్‌తో సుకుమార్.. సెన్సేషనల్ ప్రాజెక్ట్ రాబోతోందా..?


ఇదిలా ఉంటే ఇప్పుడు ముగ్గురు ప్రముఖ దర్శక నిర్మాతల కలయికలో కొత్త సినిమా రూపుదిద్దుకోనుంది. దాంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ సినిమా వైపు మళ్లింది.

Sukumar: కాశ్మీర్ ఫైల్స్‌ టీమ్‌తో సుకుమార్.. సెన్సేషనల్ ప్రాజెక్ట్ రాబోతోందా..?

Sukumar, Vivek Ranjan Agnihotri, Abhishek Agarwa

ప్రస్తుతం టాలీవుడ్ హవా ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. మన సినిమాలు దేశాలు దాటి క్రేజ్ ను సొంతం చేసుకుంటున్నాయి. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్, సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప సంచలన హిట్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు ముగ్గురు ప్రముఖ దర్శక నిర్మాతల కలయికలో కొత్త సినిమా రూపుదిద్దుకోనుంది. దాంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ సినిమా వైపు మళ్లింది. పుష్పతో పాన్ ఇండియా స్థాయిలో ఖ్యాతి గడించిన తెలుగు దర్శకుడు సుకుమార్, సంచలనమైన చిత్రాలను రూపొందించడంలో పేరు తెచ్చుకొని కాశ్మీర్ ఫైల్స్‌తో దేశవ్యాప్తంగా పాపులరైన బాలీవుడ్ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి, కాశ్మీర్ ఫైల్స్‌ కార్తికేయ 2 వంటి పాత్ బ్రేకింగ్ సినిమాలు నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాత అభిషేక్ అగర్వాల్.. ఈ ముగ్గురు కలసి ఓ ప్రాజెక్ట్ కోసం పని చేయబోతున్నారు.

తాజాగా ఈ ముగ్గురూ సమావేశమై ప్రాజెక్ట్ గురించి చర్చించారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి వివరాలను వారు వెల్లడించలేదు.  అత్యద్భుతమైన ఈ ముగ్గురు సహకారంతో రాబోతున్న చిత్రం ఎక్సయింటింగ్ ప్రాజెక్ట్ కానుంది. అభిషేక్ అగర్వాల్, వివేక్ అగ్నిహోత్రి కలిసి భారీ బ్లాక్ బస్టర్ ది కాశ్మీర్ ఫైల్స్ అందించారు. వీరిద్దరూ కలిసి మరో రెండు ప్రాజెక్ట్స్‌లో పని చేయనున్నారు. ఈలోగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని ప్రకటించారు.

“సినిమాతో ఇండియాని ఏకం చేయడం. వివరాలు త్వరలో. ఊహించండి? అంటూ సుకుమార్, అభిషేక్ అగర్వాల్ ,ది కాశ్మీర్ ఫైల్స్ అనే ట్యాగ్లను యాడ్ చేసి  ట్వీట్ చేశారు వివేక్. అలాగే ఈ  సమావేశంకు సంబధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. అయితే ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తలు చదవండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Related Articles

Back to top button