Entertainment

Tollywood: ఆ సినిమాలో బెడ్ రూమ్ సీన్ చేయలేక బోరున ఏడ్చేసిన సీనియర్ నటి..


తెలుగులో సినిమాలు చేసి చరిత్రలో నిలిచే దర్శకుల్లో ఈవీవీ సత్యనారాయణ ఒకరు. ఈవీవీ సినిమా అంటే ప్రేక్షకుల్లో తెలియని ఆసక్తి ఉంటుంది. కడుపుబ్బా నవ్వించే సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఈవీవీ.

తెలుగులో సినిమాలు చేసి చరిత్రలో నిలిచే దర్శకుల్లో ఈవీవీ సత్యనారాయణ(EVV Satyanarayan)ఒకరు. ఈవీవీ సినిమా అంటే ప్రేక్షకుల్లో తెలియని ఆసక్తి ఉంటుంది. కడుపుబ్బా నవ్వించే సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఈవీవీ. ఎన్నో హాస్యభరితమైన సినిమాలను ప్రేక్షకులకు అందించింది గొప్ప దర్శకుడు ఆయన. యాక్షన్ కంటెంట్ ఉన్న సినిమాలు రాణిస్తున్న సమయంలో.. ఈవీవీ కామెడీ జోనర్ను ఎంచుకొని మంచి విజయాలను అందుకున్నారు. అయితే  ఈవీవీ దర్శకత్వం వహించిన ఓ సినిమాలోని సన్నివేశంలో నటించడానికి ఓ సీనియర్ నటి ఇబ్బంది పడి బోరున ఏడ్చేసిందట. ఓ బెడ్ రూమ్ సన్నివేశంలో నటించాలని ఈవీవీగారు కోరితే.. తన వల్ల కాదని చెప్పలేక ఎంతో మనోవేదనకు గురైందట.. ఇంతకు అంతలా ఆ సినిమాలో ఏముంది..? అసలు ఆ హీరోయిన్ ఎవరు..?

ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన అద్భుతమైన సినిమాల్లో ఎవడిగోల వాడిదే సినిమా ఒకటి. ఈ సినిమా ఆద్యంతం హాస్యభరితంగా సాగుతుంది. ఈ సినిమాలో చాలా మంది నటీనటులు ఉన్నారు. వీరిలో సీనియర్ నటి తెలంగాణ శకుంతల కూడా నటించారు. ఈ మూవీలో నటుడు కృష్ణభగవాన్ భార్యగా శకుంతల నటించారు. అయితే ఈ సినిమా బ్యాంకాక్ లో ఎక్కువ శాతం షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో కృష్ణ భగవాన్ కు తెలంగాణ శకుంతలకు ఓ బెడ్ రూమ్ సీన్ ఉందట. దానిగురించి దర్శకుడు చెప్పగానే తెలంగాణ శకుంతల చాలా భయపడ్డారట. తన వయసు చాలా ఎక్కువ.. పైగా అలాంటి సీన్స్ లో ఆమె ఎప్పుడూ నటించలేదు. అప్పటివరకు తెలంగాణ శకుంతల కు ఓ రెబల్ ఇమేజ్ ఉంది. దాంతో ఆమె నటించలేక చాలా ఇబ్బంది పడ్డారట. ఆ సీన్ చేస్తే థన్ కుటుంబసభ్యులు ఏమనుకుంటారు అని బోరున ఏడ్చేశారట.. దర్శకుడికి ఎదురు చెప్పలేక.. అక్కడి నుంచి సినిమా వదిలేసి మధ్యలో రాలేక చాలా మనోవేదనకు గురయ్యారట శకుంతల. అయితే  దర్శకుడు ఈవీవీ ఆ సన్నివేశాన్ని ఎలాంటి అసభ్యకరంగా ఎక్కడా అనిపించకుండా కామెడీగా సాగేలా ఆ సన్నివేశాన్ని చిత్రీకరించారట ఈవీవీ. ఇక ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఈ సినిమా వస్తే టీవీలకు అతుక్కుపోతారు జనాలు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

ఇవి కూడా చదవండి



లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button