News

Sbi,Home Loan: ఎస్‌బీఐ ఒకవైపు ఆఫర్.. ఇప్పుడు ఇలా చేసిందేంటి? నేటి నుంచే అమల్లోకి.. ఏం ప్రకటన చేసిందంటే? – sbi home loan interest rates in september 2023


SBI Festival Offers: భారతీయ స్టేట్ బ్యాంక్ తన రుణ రేట్లను సవరిస్తున్నట్లు ప్రకటించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు(MCLR), సహా బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్లకు (BPLR) సంబంధించి కొత్త వడ్డీ రేట్లను ప్రకటించింది. ఈ నిర్ణయం సెప్టెంబర్ 15 నుంచే అమల్లోకి వస్తుందని బ్యాంక్ తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. బ్యాంక్ ఏ కస్టమర్‌కైనా లోన్ ఇచ్చేందుకు వసూలు చేసే కనీస వడ్డీ రేటునే ఎంసీఎల్‌ఆర్ అంటారు. అన్ని బ్యాంకులూ ఒకే విధానాన్ని పాటించేలా ఆర్‌బీఐ ఈ విధానాన్ని తీసుకొచ్చింది. చాలా వరకు బ్యాంకులు అన్ని లోన్లను ఈ ఎంసీఎల్‌ఆర్‌కు అనుసంధానం చేస్తాయి.

ఇక ఎస్‌బీఐ తాజాగా బెంచ్‌మార్క్ ప్రైమ్ రేట్లను 14.85 శాతం నుంచి 14.95 శాతానికి పెంచింది. దీంతో చాలా వరకు లోన్ వడ్డీ రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు ఎంసీఎల్‌ఆర్ రేట్లు 8 శాతం నుంచి 8.75 శాతంగా ఉన్నాయి. ఇక ఓవర్‌నైట్ MCLR రేటు 8 శాతం వద్ద స్థిరంగా ఉండగా.. ఒక నెల, 3 నెలల ఎంసీఎల్‌ఆర్ మాత్రం 8.15 శాతంగా ఉంది.

6 నెలల ఎంసీఎల్‌ఆర్ ఇప్పుడు 8.45 శాతానికి చేరింది. ఒక ఏడాది వ్యవధి ఉన్న MCLR మాత్రం 8.55 శాతంగా ఉంది. ఎక్కువగా చాలా వరకు వినియోగదారుల రుణాలు వన్ ఇయర్ ఎంసీఎల్‌ఆర్‌కే లింక్ అయి ఉంటాయని చెప్పొచ్చు. ఇక రెండేళ్లు, మూడేళ్ల వ్యవధి ఉన్న ఎంసీఎల్‌ఆర్ వరుసగా 8.65 శాతం, 8.75 శాతంగా ఉన్నాయి.

iPhone 15: అమెరికా, దుబాయ్ కంటే మన ‘ఐఫోన్’ కాస్ట్‌లీ.. 50 శాతం ఎక్కువ.. అసలెందుకీ తేడా అంటే?

AI Jobs: ఈ జాబ్‌కు ఫుల్ డిమాండ్.. ఏడాదికి రూ. 2.7 కోట్ల వరకు జీతం.. ఇవి నేర్చుకుంటే చాలు!

ఎస్‌బీఐ EBLR/RLLR

ఎస్‌బీఐ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్లలో (EBLR) ఎలాంటి మార్పు లేదు. ఇది ప్రస్తుతం 9.15 శాతం ప్లస్ CRP ప్లస్ BSP గా ఉంది. ఇంకా RLLR 8.75 శాతం ప్లస్ CRP గా ఉంది. ఇది 2023, ఫిబ్రవరి 15 నుంచి అమల్లో ఉంది. ఇక బేస్ రేటు మాత్రం 2023, జూన్ 15 నుంచి 10.10 శాతం వద్ద స్థిరంగా ఉంది.

ఫెస్టివ్ ఆఫర్లు..

ఇప్పుడు రుణ రేట్లను సవరించిన ఎస్‌బీఐ కొద్దిరోజుల కింద హోం లోన్లపై భారీ రాయితీ ప్రకటించిన సంగతి తెలిసిందే. హోం లోన్లపై రాయితీ అందిస్తూ SBI ఒక స్పెషల్ క్యాంపెయిన్ కూడా నిర్వహిస్తోంది. దీని కింద గరిష్టంగా 65 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లలో మినహాయింపు ఉంటుంది. రెగ్యులర్ హోం లోన్, ఫ్లెక్సీపే, NRI, నాన్- శాలరీడ్, ప్రివిలేజ్, అపాన్ ఘర్ వంటి వాటిపై ఈ రాయితీ ఉంది. ఇక ఈ మినహాయింపులకు చివరి తేదీ ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఉంది. దీని కింద ముఖ్యంగా సిబిల్ స్కోరు ఆధారంగా రాయితీ ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎక్కువ సిబిల్ స్కోరు ఉంటే అంత రాయితీ ఉంటుంది.

Advertisement

Gold Purity Check: మీరు కొన్న గోల్డ్ స్వచ్ఛమైనదేనా.. నకిలీదా? ఫోన్‌లోనే ఇలా చెక్ చేస్కొండి.. చాలా సింపుల్

RBI: రూల్స్ అతిక్రమించిన 4 బ్యాంకులు.. షాకిచ్చిన రిజర్వ్ బ్యాంక్.. వీటిల్లో మీకు అకౌంట్ ఉందా?

Read Latest Business News and Telugu News

Related Articles

Back to top button