News

savings account, Bank Accounts: ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉండొచ్చు.. ఈ రూల్స్ తెలుసా? – how many bank accounts can a person have


Bank Accounts: బ్యాంకు అకౌంట్ ఉండడం ప్రతి ఒక్కరికి అవసరమే. కానీ, వేరే ప్రాంతంలో ఉండాల్సి వచ్చినప్పుడు, కొత్త ఉద్యోగంలోకి మారినప్పుడు కొత్తగా బ్యాంకు ఖాతాలు తీయాల్సి వస్తుంది. దీంతో ఒకటికి మించి ఎక్కువ అకౌంట్లు తీసుకుంటాం. అయితే, ఇలా బ్యాంకు ఖాతాలు తీయాల్సి వచ్చినప్పుడు గరిష్ఠంగా ఎన్ని బ్యాంక్ అకౌంట్లు తెరవగలం అనే ప్రశ్న మన మదిలో మెదులుతూనే ఉంటుంది. దేశంలో బ్యాంక్ అకౌంట్ తెరవడానికి ఏదైనా పరిమితి ఉందా? గరిష్ఠంగా ఎన్ని బ్యాంకు ఖాతాలను ఒక వ్యక్తి తెరవగలడు అనేది తెలుసుకోవాలి.మన దేశంలో చాలా మంది వద్ద 2 అంతకన్న ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. కొందరు 4 ఆపైన ఖాతాలను కలిగి ఉంటారు. అయితే, మన దేశంలో బ్యాంకు అకౌంట్ తెరవడానికి ఎలాంటి పరిమితి లేదు. దీంతో ఒకటికి మించి ఖాతాలు తీసేందుకు వీలుకలుగుతోంది. బ్యాంకు ఖాతాల సంఖ్యపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి పరిమితి విధించలేదు. మీకు కావాల్సినన్ని బ్యాంక్ అకౌంట్లు తెరవవచ్చు. రెండు అంతన్న ఎక్కువ బ్యాంకుల్లో మీ ఖాతాను కలిగి ఉండవచ్చు. అయితే, రెండు లేదా అంతకన్నా ఎక్కువ బ్యాంకుల్లో ఖాతా కలిగి ఉన్న సందర్భంలో అన్ని ఖాతాల్లో లావాదేవీలను నిర్వహిస్తుండాలి. మీరు చాలా కాలం పాటు యాక్టివ్‌గా లేకుంటే, మీ ఖాతాను బ్యాంక్ మూసివేయవచ్చు. అందుకే మీరు మీ అన్ని ఖాతాలను ఎప్పుడూ ఉపయోగిస్తుండాలి. బ్యాంకు ఖాతలకు సంబంధించి కొన్ని రూల్స్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.

  • ప్రస్తుతం దాదాపు అన్ని బ్యాంకుల్లో శాలరీ అకౌంట్ మినహా సేవింగ్స్ ఖాతాల్లో కనీస నిల్వను నిర్వహించడం తప్పనిసరి. అంటే బ్యాంక్ ఖాతాలో ఎల్లప్పుడూ మినిమమ్ బ్యాలెన్స్ ఉంచుకోవాలి.
  • అకౌంట్లో కనీస బ్యాలెన్స్ లేనట్లయితే బ్యాంక్ మీపై పెనాల్టీ విధిస్తుంది. దీంతో నష్టపోవాల్సి వస్తుంది.
  • ఒకటికి మించి ఎక్కువ ఖాతాలు ఉన్నప్పుడు బ్యాంకులు లాభపడతాయి. ప్రతి బ్యాంకు మెసేజ్‌లు పంపడానికి ప్రతి నెలా కొంత మొత్తాన్ని వసూలు చేస్తుంది. బ్యాంక్ అకౌంట్ నిర్వహణకు కూడా మీరు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
  • డెబిట్, క్రెడిట్ కార్డులు తీసుకున్నట్లయితే మీరు వార్షిక రుసుములు చెల్లించాల్సి ఉంటుంది.
  • ఈ నేపథ్యంలో ప్రతి బ్యాంక్ అకౌంట్‌తో డెబిట్ కార్డు ఛార్జీలు, మెసేజ్ ఛార్జీలు, వార్షిక ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.
  • అందుకే మీరు ఏదైతే ఖాతాను ఎక్కువగా ఉపయోగిస్తారో ఆ అకౌంట్ కొనసాగిస్తూ మిగిలిన వాటిని మూసివేయడం మంచిది.

తగ్గిన బంగారం, వెండి ధరలు

  • Read Latest Business News and Telugu News

Debit Card: డెబిట్ కార్డు వాడుతున్నారా? మీకో అలర్ట్.. ఈ విషయాలు తెలుసుకోండి!RBI: ఆ బ్యాంకు ఖాతాల్లో రూ.35 వేల కోట్లు.. మీ డబ్బులూ ఉండొచ్చు.. తెలుసుకోండిలా!ఈ బ్యాంక్‌లో Savings Account ఉంటే చాలు.. మీ డబ్బులకు అధిక రాబడి.. ఎఫ్‌డీతో సమానంగా వడ్డీ!

Related Articles

Back to top button