saudi execution, Saudi Execution 12 రోజుల్లో 17 మందికి శిరచ్ఛేదం.. ఉరిశిక్ష విషయంలో రాజీపడని సౌదీ యువరాజు – saudi arabia beheading by sword and executes 12 drugs convicts in 10 days
మరశిక్షణ పడినవారిలో ఏడుగురు సౌదీ పౌరులతో పాటు 9 మంది విదేశీయులు ఉన్నారు. వీరిలో ముగ్గురు పాకిస్థానీయులు, నలుగురు సిరియా వాసులు, ఇద్దరు జోర్డాన్ దేశస్థులు. వివిధ వివిధ నేరాల్లో దోషులుగా ఉన్న 81 మందికి సౌదీ ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో మరణశిక్షణను అమలు చేసింది. వీరిలో ఉగ్రవాదులే ఎక్కువ మంది ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా, 2018లో మరశిక్షణల అమలుపై సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ మాట్లాడుతూ.. ఇకపై తమ ప్రభుత్వం మరణశిక్షలను వీలైనంత వరకు తగ్గిస్తుందని హామీ ఇచ్చారు.
కేవలం హత్యలకు పాల్పడిన వారికే మరణశిక్ష విధిస్తామని పేర్కొన్నారు. జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గీ హత్య తర్వాత సౌదీ ప్రభుత్వంపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తడంతో మరణశిక్షణల అమలుపై ఈ విధమైన ప్రకటన చేసింది. గత రెండేళ్లుగా దోషులకు కేవలం ఉరిశిక్షలను మాత్రమే అమలు చేస్తున్న సౌదీ.. మళ్లీ శిరచ్ఛేదం శిక్షను అమలు చేసింది. ఈ ఏడాది ఇప్పటి వరకు మొత్తంగా 132 మందికి మరణశిక్షణను అమలు చేసింది. 2020, 2021తో పోలిస్తే ఈ సంఖ్య చాలా అధికం.
అక్టోబరు 2018లో ఇస్తాంబుల్ కాన్సులేట్ సమీపంలో సౌదీ దళాల చేతుల్లో ఖషోగ్గీ హత్యకు గురయ్యారు. సౌదీలో మరణ శిక్షలు అమలు.. యువరాజు ప్రకటనకు పొంతనే లేదని మానవహక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. మయా ఫో అనే ఓ హక్కుల కార్యకర్త మాట్లాడుతూ.. ‘‘మహమ్మద్ బిన్ సల్మాన్ ఉరిశిక్షలను తగ్గించడం, మాదకద్రవ్యాల నేరాలకు మరణశిక్షను ముగించడమనే పురోగతి గురించి పదేపదే ప్రచారం చేశాడు.. కానీ ఉరిశిక్షల రక్తపాత సంవత్సరం ముగుస్తున్నందున సౌదీ అధికారులు మాదకద్రవ్యాల నేరస్థులను మళ్లీ పెద్ద సంఖ్యలో రహస్యంగా ఉరితీయడం ప్రారంభించారు’’ అని ఆరోపించారు.
ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్ అధికార ప్రతినిధి ఎలిజబెత్ థ్రోస్సెల్ మాట్లాడుతూ.. ఈ ఏడాది రికార్డు స్థాయిలో సౌదీ మరణ శిక్షలను అమలు చేసింది. ఈ మరణశిక్షలు ‘తీవ్ర విచారకరం’ అని పేర్కొన్న ఆమె… మరణించిన వారిలో నలుగురు సిరియన్లు, ముగ్గురు పాకిస్థానీయులు, ముగ్గురు జోర్డానియన్లు, ఏడుగురు సౌదీలు ఉన్నారని చెప్పారు.
‘‘ఐరాస జనరల్ అసెంబ్లీలోని అనేక దేశాలు ప్రపంచవ్యాప్తంగా మరణశిక్షపై మారటోరియంకు పిలుపునిచ్చిన కొద్ది రోజులకే సౌదీ అరేబియాలో మాదకద్రవ్యాలకు సంబంధించిన నేరాలకు పాల్పడినవారికి మరణశిక్షలను తిరిగి ప్రారంభించడం చాలా విచారకరమైన చర్య.. మాదకద్రవ్యాల నేరాలకు మరణశిక్ష విధించడం అంతర్జాతీయ ప్రమాణాలు, మానవహక్కుల ప్రమాణాలకు విరుద్ధం’’ అని ఓ ప్రకటన విడుదల చేసింది.
Read Latest International News And Telugu News