News

satyavathi rathod, Road Accident: మంత్రి సత్యవతి రాథోడ్ కాన్వాయ్‌లో ఘోర ప్రమాదం.. కారు బోల్తా – accident to minister satyavathi rathod escort vehicle in mulugu


రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కాన్వాయ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ములుగు జిల్లా తాడ్వాయి వద్ద మంత్రి సత్యవతి రాథోడ్ ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం జరిగింది. జిల్లాలో పలు అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే సీతక్కతో కలిసి ప్రారంభించి.. తిరిగి వెళ్తున్న సమయంలో.. తాడ్వాయి వద్దకు రాగానే.. ఎదురుగా వస్తున్న బొలేరో వాహనం, కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనం బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో.. అటు బొలేరో వాహనం బోల్తా పడగా.. ఇటు ఎస్కార్ట్ వాహనం తీవ్రంగా ధ్వంసమైంది. కాగా.. ఈ ఘటనలో ఎస్కార్ట్ సిబ్బందితో పాటు బొలెరో వాహనం డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులందరిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఈ ఘటనలో మంత్రికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అయితే.. ముప్పనపల్లి గ్రామంలో.. జీసీసీ ఆధ్వర్యములో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకుతో పాటు మండల ప్రజా పరిషత్ కార్యాలయం, పల్లె ధవఖానను మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. అనంతరం ఏటూరు నాగారం ప్రభుత్వ హాస్పటల్‌లో రోగ నిరోధక నిర్ధారణ భవనాన్ని కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సీతక్కతో పాటు జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

పెట్రోల్ బంకుల్లో 2 వేల నోట్ల కష్టాలు

‘తమాట కూర ఉడుకుతంది.. బుక్కెడు బువ్వ తినిపోదువాగు బిడ్డా’.. రసమయిపై వృద్ధురాలి ఆప్యాయత

  • Read More Telangana News And Telugu News

Related Articles

Back to top button