News

sankranti holidays, సంక్రాంతి పండుగకు ఊరెళ్తున్నారా? ఇలా అస్సలు చేయొద్దు.. ఏపీ పోలీసుల అలర్ట్! – ap police key suggestions to people who go to villages for sankranti


సంక్రాంతి పండగకు ఊరెళ్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త! దొంగలు మీ ఇళ్లను గుళ్ల చేసే ఛాన్స్ ఉంది. దాచుకున్న డబ్బు, నగలు దోచుకెళ్లే ప్రమాదం ఉంది. సంక్రాంతి పండుగకు ఇళ్లకు తాళం వేసి సొంతూళ్లకు వెళ్లే వారి ఏపీ పోలీసులు ప్రత్యేక సూచనలు చేశారు. సంక్రాంతి సెలవులకు చాలా మంది సొంతూళ్లకు, చుట్టాల ఇళ్లకు వెళ్లడం సర్వసాధారణం. అయితే, ఇంటికి తాళం వేసి వెళ్లే క్రమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.. లేకపోతే దొంగలు దీన్ని అదనుగా భావించి చోరీలకు పాల్పడే అవకాశముందని హెచ్చరించారు.

పండుగకు ఊరికెళ్తున్న ప్రజలు విలువైన వస్తువులు, ఆభరణాలు తాళం వేసిన ఇంట్లో పెట్టుకోకూడదని.. బ్యాంకుల్లో భద్రంగా ఉంచుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. లేకపోతే లాక్ట్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టం (11145) సేవలు వినియోగించుకోవాలన్నారు. సంక్రాంతి నేపథ్యంలో దొంగతనాల నియంత్రణకు పోలీసు పరంగా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టామని అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప వెల్లడించారు.

అలాగే, పండుగకు ఊరెళ్లిన సమాచారం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయకుండా ఉండటమే మంచిదని ఎస్పీ ఫకీరప్ప సూచించారు. బస్సుల్లో ప్రయాణించే వారు విలువైన వస్తువులు, ఆభరణాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే, ప్రయాణాలు చేసే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తినడానికి ఏమైనా ఇస్తే.. తిరస్కరించాలని సూచించారు. పండుగ సమయంలో దొంగలు పక్కాగా స్కెచ్ వేసుకుంటారని.. అత్యంత అప్రమత్తంగా లేకపోతే నష్టపోయే అవకాశం ఉందని హెచ్చరించారు.

Related Articles

Back to top button