Allu Arjun-Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి, అల్లు అర్జున్ కాంబో మూవీ టైటిల్ ఇదేనా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ కోసం రెడీ అవుతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా హిట్ గా నిలిచినా విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ సినిమా సెకండ్ పార్ట్ ను తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. పుష్ప సినిమాలో బన్నీ నటన ప్రేక్షకులను ఫిదా చేసింది. మునుపెన్నడూ కనిపించనంత ఊర మాస్ పాత్రలో బన్నీ నటించి మెప్పించాడు. అలాగే ఈ సినిమా హీరోయిన్ గా రష్మిక మందన్న చేసింది. ఇదిలా ఉంటే ఈ మూవీ సెకండ్ పార్ట్ లో మొదటి దానికంటే ఎక్కువ ట్విస్ట్ లు.. యాక్షన్స్ సీక్వెన్స్ ఉంటాయని తెలుస్తోంది. అయితే ఈ సినిమా తర్వాత బన్నీ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాను ప్రకటించారు. అప్పటి నుంచి బన్నీ ఫ్యాన్స్ ఆనందానిలో అవధులు లేవు.
అర్జున్ రెడ్డి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సందీప్.. హిందీలో ఇదే సినిమాను కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా భారీ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో యానిమల్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.
అలాగే ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఆ తర్వాత బన్నీ సినిమా పట్టాలెక్కుతోంది. కాగా సందీప్ రెడ్డి బన్నీతో చేసే సినిమా టైటిల్ ఇదే అంటూ సోషల్ మీడియాలో జోరుగా ఓ వార్త ప్రచారం అవుతోంది. అల్లు అర్జున్ సినిమాకు భద్రకాళి అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట సందీప్. కథకు సరిగ్గా ఈ టైటిల్ సూటవుతుందని అనుకుంటున్నారట. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.