Entertainment

Samyuktha meenan: సంయుక్త మీనన్ దెబ్బకు ఆ హీరోయిన్స్ జాగ్రత్త పడుతున్నారా..?


బింబిసారా సినిమాతో హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. అలాగే ధనుష్ నటించిన సార్ సినిమాతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టింది. ఇక లేటెస్ట్ గా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమాలో నటించింది. ఈ సినిమా గత నెల 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సంయుక్త మీనన్.. ఇప్పుడు ఈ పేరు టాలీవుడ్ లో కాస్త గట్టిగానే వినిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ చిన్నది. ఆ సినిమాలో రానా భార్యగా నటించి మెప్పించింది. అలాగే బింబిసారా సినిమాతో హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. అలాగే ధనుష్ నటించిన సార్ సినిమాతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టింది. ఇక లేటెస్ట్ గా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమాలో నటించింది. ఈ సినిమా గత నెల 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే ఈ మూవీ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో సంయుక్త ఖాతాలో మరో హిట్ పడింది. సాయి ధరమ్ తేజ్ కు ఈ సినిమా సాలిడ్ కంబ్యాక్ అనే చెప్పాలి. విరూపాక్ష సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది సంయుక్త మీనన్. ఈ సినిమాతో అమ్మడి రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.

సినిమాల  విషయంలో సంయుక్త మీనన్ ఆచితూచి అడుగులేస్తోంది. అయితే సంయుక్త ఎంట్రీ తో ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ కు గుబులు పట్టుకుంది అంటున్నారు కొందరు విశ్లేషకులు. ఈ మధ్య స్టార్ హీరోయిన్స్ ఏడాదికి ఒక సినిమా చేస్తున్నారు. అయితే అవి హిట్ అవుతాయన్న గ్యారెంటీ అస్సలు లేదు. సమంత హిట్స్ లేక సతమతం అవుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ చాలా రోజులనుంచి టాలీవుడ్ లో కనిపించడం లేదు. రాష్మీకా పుష్ప 2 సినిమా చేస్తున్నా బాలీవుడ్ వైపు చూస్తుంది. ఇక లావణ్య త్రిపాఠి, రాశిఖన్నా, నివేద థామస్ లాంటి హీరోయిన్స్ అలా కనిపించి ఇలా మాయమవుతున్నారు. మరో వైపు బాలీవుడ్ నుంచి వరుసగా బ్యూటీలంతా టాలీవుడ్ కు క్యాలు కడుతున్నారు.

దాంతో ఇక్కడ అల్ రెడీ హీరోయిన్ గా హోదా సంపాదించుకున్న ముద్దుగుమ్మలు ఆలోచనలో పడ్డారు. అటు వరుసగా విజయాలనుదుకుంటున్న సంయుక్త మీనన్ కు అవకాశాలు మెండుగా వస్తున్నాయ్. ఒకటి రెండు పెద్ద హీరోల సినిమాల్లో నటిస్తే మాత్రం ఈ అమ్మడి దశ తిరిగినట్టే.. మరో 5 ఏళ్ళు టాలీవుడ్ లో రాణించడం ఖాయం అంటున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button