Entertainment

Samantha: ఎక్కడికి వెళ్లినా జపమాల.. ఆధ్యాత్మిక ధోరణి.. మాటల్లో వేదాంతం.. పూర్తిగా మారిపోయిన సామ్


సమంత చేతిలో ఉన్న జపమాల అందరి అటెన్షన్‌ను క్యాచ్ చేసింది. రీసెంట్‌గా ముంబై ఎయిర్‌పోర్టులో కూడా ఈ జపమాల తన చేతిలో కనిపించింది.

విడాకులతో పూర్తిగా కుంగిపోయింది సామ్.  ఆ ఫేజ్‌లో ఉండగానే ‘మయోసైటిస్’ వ్యాధి బారిన పడింది. ఇప్పడిప్పుడే కోలుకుంటున్న సామ్.. తన తదుపరి ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ పెట్టింది. చాలాకాలం తర్వాత ముంబై ఎయిర్‌పోర్ట్‌లో తారసపడిన సామ్.. తాజాగా శాకుంతలం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో కన్నీరు పెట్టుకోవడం చర్చనీయాంశమైంది.  గూడుకట్టిన బాధంతా ఒక్కసారిగా బయటపడిందా? పంటిబిగువున దాచిన బాధతా కన్నీరుగా మారిందా? సినిమా అంటే ప్రేమ ఉన్నా.. ఆరోగ్యం సహకరించట్లేదా? ఎంత మయోసైటిస్‌ అయితే మాత్రం ఇంతలా పిండేస్తుందా? సమంత కన్నీరు చూసిన తర్వాత.. ఆమె ఉద్వేగం చూసిన తర్వాత .. ఆమె మాటలు విన్న తర్వాత .. అభిమానుల నుంచి వస్తున్న ప్రశ్నలవి.

సమంత.. సమంత… శాకుంతలం ట్రైలర్‌ లాంచ్‌కి సమంత వస్తున్నారనే వార్త నిన్నటి నుంచే వైరల్‌ అవుతోంది. ఈ మధ్య ఎయిర్‌పోర్టులో కనిపించారు సమంత. అయినా ఆమె ఆరోగ్యం గురించి అందరిలోనూ ఆసక్తి కనిపిస్తోంది. సమంత ఇప్పుడెలా ఉన్నారు? స్పీడుగా నడవగలుగుతున్నారా? గతంలోలాగా ఓపిగ్గానే కనిపిస్తున్నారా? అంటూ ఆరా తీసేవారి సంఖ్య, ఆత్రుతతో ఎదురుచూసే వారి సంఖ్య ఎక్కువగానే కనిపించింది. అందరి ఎదురుచూపులకూ సమాధానం దొరికింది. తెల్లటి కాస్ట్యూమ్స్ తో సమంత శాకుంతలం ఈవెంట్ కి హాజరయ్యారు. దర్శకుడు గుణశేఖర్‌ మాట్లాడుతున్నప్పుడు ఎమోషనల్‌ అయ్యారు. యశోద మూవీ రిలీజ్‌కి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ కంటతడి పెట్టారు సామ్‌. జీవితంలో ఎన్నిటినో దాటుకుని వచ్చానని అప్పుడు ఎమోషనల్‌ అయ్యారు.

శాకుంతలం ప్రాజెక్ట్ గురించి చెబుతూ గుణశేఖర్‌ మాట్లాడుతూ కంటతడిపెడితే, అది చూసి వెంటనే ఎమోషనల్‌ అయ్యారు సమంత. కళ్లజోడు జరిపి, ఆమె కంటతడి పెడుతుంటే చూపరుల మనసూ ద్రవించింది. మయోసైటిస్‌ ఎటాక్‌ అయిన తర్వాత సమంత మరింత సున్నితంగా మారారు. అంతకు ముందు ఆమె మాట్లాడే విధానానికి, ఇప్పుడు ఆమె మాట తీరుకూ చాలా మార్పు వచ్చింది. మాటల్లో కాస్త పెద్దరికం కనిపిస్తోంది. ఇప్పుడు కూడా శాకుంతలం ఈవెంట్‌లో సమంతను చూసిన వారందరూ… ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. శకుంతలం ఈవెంట్‌లో సమంత చూడ్డానికి కాస్త నీరసంగానే కనిపించారు. ఓపిక లేకున్నా, ఓపిక తెచ్చుకుని ఇక్కడికి వచ్చానని అన్నారు సామ్‌.

శాకుంతలం సినిమా తనకెంత స్పెషలో చెప్పారు. శకుంతల పాత్ర కోసం ఆద్యంతం ఓ గ్రేస్‌ మెయింటెయిన్‌ చేయాల్సి వచ్చింది. కూర్చున్నప్పుడు, నడిచినప్పుడు, నవ్వినప్పుడు, కదలినప్పుడు.. ఆఖరికి ఏడ్చినప్పుడు కూడా ఓ గ్రేస్‌ మెయింటెయిన్‌ చేశాను. దాని కోసం స్పెషల్‌గా ట్రెయిన్‌ అయ్యాను అని ఆ మధ్య ఇన్‌స్టాలో రాశారు. శాకుంతలం ట్రెయిలర్‌ లాంచ్‌లో ఎడమచేతికి ఓ పూసలదండను చుట్టుకున్నారు సామ్‌. అది జపమాలలా ఉంది. 64 పూసలున్న దండను సమంత క్యారీ చేశారు. ఆ దండను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ ఎంబ్రేస్‌ యువర్‌ మేజిక్‌ అని కామెంట్‌ పెట్టారు సామ్‌. ఆ పదాలకు అర్థం ఏంటనే చర్చ నెట్టింట మొదలైంది. కష్టమైనా, నష్టమైనా ఉన్నది ఉన్నట్టు స్వీకరించే తన మనస్తత్వాన్ని చెప్పడానికి ఆమె అలా రాసుకొచ్చారని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. తన ప్రస్తుత పరిస్థితిని సమంత ఈ రకంగా చెప్పారనే మాటలు వినిపించాయి. కాగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించనప్పుడు సైతం ఆ చేతికి ఈ పూసల దండ ఉంది.

సమంత మాటల్లో ఈ మధ్య కాస్త వేదాంత ధోరణి కనిపిస్తుందని అంటున్న వారూ లేకపోలేదు. ఇంతకు ముందు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించే దాన్ని. కానీ ఇప్పుడు ఈ క్షణం గడిస్తే చాలనిపిస్తోంది. ప్రెజెంట్‌ సిట్చువేషన్‌ బావుండాలని కోరుకుంటున్నాను అని ఆ మధ్య చెప్పారు సామ్‌. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించారు సామ్‌. శిల్పారెడ్డితో కలిసి కేదార్‌నాథ్‌తో పాటు పలు ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించారు. ఐస్‌ స్కేటింగ్‌ చేశారు. చేయాల్సిన సాహసాల లిస్టు రాసుకుని ఒక్కొక్కదానికీ టిక్కు పెట్టేసే టైమ్‌ వచ్చిందని అప్పట్లో అన్నారు. మయోసైటిస్‌ తర్వాత దాని గురించి ఆలోచించట్లేదు సామ్‌. గతంలోనూ కోయంబత్తూర్‌ ఈషా ఫౌండేషన్‌కి కూడా వెళ్లారు సమంత.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button