Samantha: ‘నువ్వు లేకుండా నేనెం చేయలేను’.. ఆసక్తికర పోస్ట్ చేసిన సమంత..
అలాగే పలుమార్లు మోటివేషన్ కోట్స్ సైతం ఫాలోవర్లతో పంచుకుంటారు. తాజాగా సామ్ చేసిన ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇంతకీ సమంత షేర్ చేసిన ఫోటో ఏంటో చూద్దామా.
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతకు సంబంధించిన ప్రతి చిన్న విషయం నెట్టింట క్షణాల్లో వైరలవుతుంటాయి. కొద్ది రోజులుగా మయోసైటిస్ సమస్యకు చికిత్స తీసుకుంటున్న సామ్.. ఇటీవలే సిటాడెల్ చిత్రీకరణలో జాయిన్ అయ్యింది. ఈ సిరీస్ అనంతరం ఆమె ఖుషి సినిమా షూటింగ్ సెట్లో అడుగుపెట్టనుంది. ఓవైపు సినిమాలతో బిజీగా.. మయోసైటిస్ సమస్యకు చికిత్స తీసుకుంటున్నా.. తన హెల్త్.. మూవీ అప్డేట్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటారు. అలాగే పలుమార్లు మోటివేషన్ కోట్స్ సైతం ఫాలోవర్లతో పంచుకుంటారు. తాజాగా సామ్ చేసిన ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇంతకీ సమంత షేర్ చేసిన ఫోటో ఏంటో చూద్దామా.
చిత్రపరిశ్రమలో సమంతకు ఉన్న స్నేహితుల గురించి చెప్పక్కర్లేదు. డైరెక్టర్ రాహుల్, సింగర్ చిన్మయి, డైరెక్టర్ నందిని రెడ్డి ఇలా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వారితో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ వారిపై తన ప్రేమను తెలియజేస్తుంటుంది. ఈరోజు డైరెక్టర్ నందినీ రెడ్డి పుట్టిన రోజు కావడంతో మరోసారి తనతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ… ఆమెపై ప్రశంసలు కురిపించింది సామ్. జబర్దస్థ్, ఓ బేబీ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు నందిని రెడ్డి. ఈ రెండు చిత్రాల్లో కథానాయికగా సమంత నటించింది. జబర్దస్త్ సినిమా సమయం నుంచే వీరిద్దరు మంచి స్నేహితులు.
“ప్రతి ఒక్కరి జీవితంలో నీలాంటి ఫ్రెండ్ ఒకరుండాల్సిందే. ఎప్పుడూ బాధలు దరికి రానివ్వరు. బాధ పడాల్సిన సమయంలోనూ నవ్విస్తుంటావ్. ఎప్పుడూ ఆనందంగా ఉంచేందుకు ప్రయత్నిస్తావ్. నువ్వు లేకుండా నేనేం చేయగలను. లవ్యూ.. హ్యాపీ బర్త్ డే” అంటూ నందిని రెడ్డితో కలిసి ఉన్న ఫోటో షేర్ చేసింది సమంత. ఆ పోస్ట్ కు నందినిరెడ్డి రిప్లై ఇచ్చింది. సామ్.. బిగ్ హాగ్స్.. లవ్యూ లోడ్స్ అంటూ కామెంట్ చేసింది.

Samantha
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి